Health tips : : అందంతో పాటు ఆరోగ్యం కూడా చాలా అవసరమే. మనిషి పైకి చూడడానికి ఎంత బాగున్నా, శరీరం లోపల కూడా అంత పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అసలు శుభ్రత అంటే పొట్టలో పేరుకుపోయిన విషాలను బయటకు తొలగించడమే, అంటే డిటా క్స్ చేయాలని అర్థం. శరీరంలో విష పదార్థాలు ఎక్కువైనప్పుడు దానికి అనుగుణంగా శరీరం మనకు కొన్ని ఆరోగ్య సమస్యలను వెలువరిస్తుంది. ఇటువంటి సమయంలో శరీరాన్ని డిటాక్స్ చేసుకోవాలి. నోటి నుంచి దుర్వాసన ,శరీరంపై చమట నుంచి చెడు వాసన, శరీరంలో విష పదార్థాలు పేర్కొన్నాయని అర్థం. అదే సమయంలో శ్వాస కూడా చెడు వాసన కలిగిస్తుంది.
మీకు ఈ సమస్య ఎదురైతే మీ శరీరాన్ని డిటాక్స్ చేసుకోవాల్సిన సమయం వచ్చింది అర్థం. అసలు శరీరాన్ని డిటాక్స్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి ? బయట ఫుడ్డు ఎక్కువగా తీసుకోవడం వల్ల, దానికి తగిన విధంగా నీటిని తీసుకోకపోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు మన ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండడానికి ఈ విష పదార్థాలను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. కడుపు ఉబ్బరం, ఆకలి లేకపోవడం, మలబద్దక్ వంటి సమస్యలు కూడా శరీరాన్ని డిటాక్స్ చేసుకోవాలని చూసి స్తాయి. అదేవిధంగా పేగుల్లో పేరుకుపోయి ఉన్న వ్యర్ధాలు, పదార్థాలు జీర్ణ వ్యవస్థను బలహీన పరుస్తాయి.
Health tips : ఇవి తింటే చాలు

పొట్ట సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి శరీరాన్ని అదే సమయంలో డిటాక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. స్త్రీలకు ఇటువంటి టైంలో చిరాకుగా అనిపిస్తుంది. చర్మ సంబంధిత సమస్యలు వల్ల కూడా శరీరంలో వ్యర్ధాలు పేరుకు పోతాయి. కావున అటువంటి సమయంలో చర్మం పై ముడతలు ,మొటిమలు, నల్ల మచ్చలు ఏర్పడతాయి. కాబట్టి ఇటువంటి సమస్య ఎదురవుతుంటే, శరీరాన్ని డిటాక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాతావరణం లో ఏర్పడ్డ మార్పులు వల్ల కూడా వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు దారితీస్తాయి.
దీంతో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి ఇటువంటి సమయంలో తేలికపాటి ఆహార పదార్థాలను తీసుకోవాలి. మార్కెట్లో దొరికే కోతిమీర, పుదీనా ఒంట్లో పేరుకుపోయి ఉన్న వ్యర్ధాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. కొత్తిమీర రక్తంలోనే చిక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది. పుదీనా మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం కావడం లో బాగా సహాయపడుతుంది. పుదీనా టీ తాగడం వల్ల గ్యాస్, ఉబ్బసం, మలబద్ధకం సమస్యలను దూరం చేసి చర్మ ఆరోగ్యాన్ని, దంతాలు తెల్లగా మారటానికి, చెమట నుంచి వచ్చిన దుర్వాసన పోగొట్టడానికి తోడ్పడుతుంది. ఇవే కాకుండా వెల్లుల్లి ,దానిమ్మ ,బ్రోకలీ వంటివి కూడా శరీరాన్ని డి టాక్స్ పై చేయగలవు. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ కంటే ఇవి తింటే ఆరోగ్యం చాలా బాగుంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.