Ulcer Home Remedy : ప్రస్తుత కాలంలో ఆధునిక జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు వల్ల జీర్ణకోశ సమస్యలు అధికమవుతున్నాయి. ఎక్కువమందిలో ముఖ్యంగా అల్సర్, గ్యాస్టిక్ వంటి సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. అల్సర్ వచ్చిందంటే ఇక ఎటువంటి ఆహార పదార్థాలు తిన్న ఇబ్బందికరంగానే ఉంటుంది. అలసరి సమస్యతో బాధపడే వారు ఎటువంటి ఆహార పదార్థాలు తినాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. జీర్ణాశ్రయంలో ఏర్పడే అలసర్ను గ్యాస్టిక్ అల్సర్ అంటారు. మన జీర్ణ వ్యవస్థలో కొద్ది పరిమాణంలో యాసిడ్ అవసరం. ఈ జీర్ణవ్యవస్థలో యాసిడ్ ఎక్కువైనా తక్కువైనా అల్సర్లు తయారవుతాయి. హేలికో బ్యాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా కూడా అల్స ర్స్ కుప్రధాన కారణం అవుతుంది. 70 శాతం మందిలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల అలసర్లు వస్తాయి. ఎక్కువమందిలో కడుపులో పుండ్లు రావడానికి హెలికో బ్యా క్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా కారణం అవుతుంది.
సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం. స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం. మానసిక ఒత్తిడి, ఆల్కహాలు స్మోకింగ్, నిద్రలేమి సమస్యలు ముఖ్య కారణాలు అల్సర్ వల్ల తీవ్రమైన కడుపునొప్పి, అలసట, జ్వరం, బరువు తగ్గడం, రక్తహీనత, ఆకలి లేకపోవడం, రక్తంతో కూడిన విరోచనాలు, కడుపులో మంట, ఉబ్బరం, చాతిలో నొప్పి, పుల్లటి తేపులు, నోటిలో ఎక్కువగా నీళ్లు పోరాటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మనం తినే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అల్సర్ మందుగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీ ,టీలు తాగకపోవడం, స్పైసీ ఫుడ్డు తగ్గించడం అల్సర్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు అని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు.
Ulcer Home Remedy : ఈ జ్యూస్ తో అల్సర్లు సంబంధిత సమస్యలు మటుమాయం.

మన డైట్ లో కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే అల్సర్ నుంచి విముక్తి పొందవచ్చు అవేంటో తెలుసుకుందాం. కొన్ని అధ్యయనాల ప్రకారం అల్సా ర్లను క్యాబేజీ నయం చేస్తుంది. కడుపులో ఏర్పడ్డ పుండ్లు తగ్గించడంలో క్యాబేజీ ప్రభావంతంగా పనిచేస్తుంది. క్యాబేజీ లోని సమ్మేళనాలు కడుపులోని అల్సా ర్లను తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు. క్యాబేజీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది అల్సా ర్లను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ప్రతిరోజు ఒక గ్లాస్ క్యాబేజీ రసం తాగితే… అల్సర్ర్లు తగ్గుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ తేనెలో పుష్కలంగా లభిస్తాయి. తేనె తీసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు దూరమవుతాయి. తేనెలోనే గుణాలు హైడ్రోజన్ పెరాక్సైడ్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది అల్సర్ తగ్గించే బ్యాక్టీరియా హెలికో బ్యాక్టర్ పైలోరీతో పోరాడటానికి సహాయపడుతుంది.
వివిధ రకాల క్యాన్సర్ కణాలతో పోరాడటానికి తేనె ఉపయోగపడుతుంది. అల్సర్స సమస్యతో బాధపడేవారు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక్క టేబుల్ స్పూన్ తేనె, చిటికెడు దాల్చిన చెక్కను పొడి వేసి బాగా కలిపి తాగండి. పసుపు యాంటీ ఇన్ఫ్లమెంటరీ, యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. దీనిని వాడడం వల్ల కడుపులో అల్సర్ కు కారణమయ్యే.. బ్యాక్టీరియా పెరగదు. రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. వాపు గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కడుపులో అల్సర్ల సమస్య ఉన్నవారు ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో, ఒక్క టీ స్పూన్ పసుపు వేసి రోజుకి రెండు నుంచి మూడు సార్లు తాగితే మంచిది.