Drink Water : మనిషికి ఆహరం ఎంత అవసరమో నీళ్ళు కూడా అంతే అవసరం. చాలామంది నీటిని తాగేందుకు సంకోచిస్తుంటారు. పదేపదే మూత్ర విసర్జనకు వెళ్ళాల్సి వస్తుందని నీటిని అవసరమైన మేరకు తీసుకోరు. రోజుకు నాలుగున్నర లీటర్ల నీటిని తీసుకోవాలని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా తగిన మోతాదులో తాగునీటిని తీసుకోవడం తప్పనిసరి. కాదు కూడదనుకుంటే పదేపదే అనారోగ్య సమస్యలు తలెత్తడం మాత్రం ఖాయం.
ఉదయం లేవగానే తాగునీటిని తీసుకోవడం చాలా మంచిది. ఈ అలవాటు ఉన్న వారిలో చాలామటుకు అనారోగ్య సమస్యలు తక్కువగా వస్తుంటాయి. నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే నీటిని తీసుకోవడం వలన మలబద్దకం సమస్య తొలగిపోతుంది. ఉదయం లేవగానే నీటిని తీసుకోవడం వలన రోజంతా శరీరం ఉత్తేజంగా ఉంటుంది. కొందరు ఉదయం నీటిని తీసుకుంటున్నారు కానీ బ్రెష్ చేసిన తరువాత ‘టీ’ ని తీసుకునే ముందు తాగుతున్నారు. ఈ అలవాటును మాని బ్రెష్ చేసుకునే కంటే ముందుగానే వాటర్ తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పళ్ళు brushing teeth తోమకముందే నీళ్ళు తాగడం వలన ఆరోగ్యం బాగుంటుంది. శరీరం కాంతివంతంగా కూడా ఉంటుంది. తిన్న ఆహార పదార్థాలు జీర్ణం కావడంలో నీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తాయి. జీర్ణ వ్యవస్థగా సక్రమంగా పని చేస్తుంది. కిడ్నీలపై భారం పడకుండా ఉంటుంది. అందుకే ఉదయం నిద్ర లేవగానే నీటిని తీసుకోవడం మరీ మంచిది. ఈ అలవాటు లేని వారు ఇకనైనా అలవాటు చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎందుకంటే అది మీ చేతుల్లోనే ఉంది.