Health Tips : ఇది ఒక్క గ్లాస్ త్రాగారంటే చాలు.. ఎటువంటి నొప్పులు రావు..

Health Tips  : సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. కానీ ప్రస్తుతం మారిన జీవన శైలి కారణంగా ప్రజలు రుచి కోసం వివిధ రకాలుగా వంటలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. మోకాళ్ళ నొప్పులు, కాళ్ల నొప్పులు, కీళ్ళ నొప్పులు, నరాల బలహీనత, తిమ్మిర్లు రావడం వంటి సమస్యలన్నీ కూడా సరైన ఆహారం తీసుకోకపోవడం వలనే వస్తాయి అని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ సమస్యలను పోగొట్టుకోవడానికి ఒక డ్రింక్ బాగా సహాయపడుతుంది. దీనిని ప్రతిరోజు తీసుకోవడం వలన ఎటువంటి నొప్పులు ఉండవు. ఎముకలు ఉక్కులా దృఢంగా మారుతాయి .

Advertisement

it-is-enough-to-drink-one-glass-no-pain-will-come

Advertisement

ఈ డ్రింక్ తయారు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు : గసగసాలు, సోంపు, కొబ్బరి పొడి, నెయ్యి, ఆవు పాలు, స్పటిక బెల్లం. ఒక గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి వేసి దానిలో ఒక స్పూన్ గసగసాలు వేసి దోరగా వేయించాలి. తర్వాత అందులో ఆవుపాలు ఒక గ్లాస్ వరకు పోసుకోవాలి. ఆ తర్వాత ఎండు కొబ్బరిని ఒక స్పూన్, సోంపు గింజలు ఒక స్పూన్ ఈ పాలలో వేసుకోవాలి. సోంపు గింజల్ని పౌడర్ గా చేసి కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు త్రాగటానికి వీలుగా ఉంటుంది.

ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి ఐదు నిమిషాల పాటు మరిగించాలి. తరువాత రుచి కోసం పట్టిక బెల్లం వేసుకోవాలిష అయితే డాక్టర్ల సలహా మేరకే ఈ స్పటిక బెల్లాన్ని వాడాల్సి ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక గ్లాసులోకి ఈ డ్రింక్ ను తీసుకొని త్రాగాలి. ఇది చేయడం కూడా చాలా ఈజీ. ఈ డ్రింక్ ఎముకలు, కీళ్లకు బలాన్ని ఇస్తాయి. అయితే ఈ డ్రింక్ రాత్రి సమయంలో భోజనం తర్వాత ఒక గ్లాసు త్రాగి పడుకోవాలి. ప్రతిరోజు ఇలా త్రాగితే కాళ్లు నొప్పులు, చేతులు తిమ్మిర్లు నడుము నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

Advertisement