పాముకాటు కంటే దోమకాటే ప్రమాదకరమా?

పాము కాటు కంటే దోమ కాటే ప్రమాదకరమని మన శాస్త్రవేత్తలు ముంబాయిలోని సెంట్రల్ రీసర్చ్ సెంటర్ లో ఈ మధ్య కనుగొన్నారు. పాము కాటు వెంటనే విషం ఎక్కుతుంది. కానీ దోమ కాటు స్లో పాయింజన్ లాగ పనిచేస్తుంది అని తెలిపారు. అందుకే మలేరియా, డెంగ్యు, మరో 12 రకాల ప్రాణాంతక వ్యాధులు వస్తాయని మనకు తెలుసు. కానీ ఆ కాటు పాము కాటుకంటే ప్రమాదకరం అని తెలియదు.

మలేరియా వ్యాదిని కనుగొన్న శాస్త్రవేత్తఎవరో మనవాళ్ళకు చాలా మందికి తెలియదు. సికింద్రాబాద్ కు సమీపంలో ఉన్న బేగం పేటలో ఉండే బ్రిటిష్ శాస్త్రవేత్త సర్ రోనాల్డ్ రాస్ కనుగొన్నారు. దోమకాటు వల్ల మలేరియా వస్తుంది ఆయన రుజువుచేయగానే ప్రపంచం విస్తుపోయింది. దీనికి గాను 1902 లో ఆయనకు నోబెల్ బహుమతి వచ్చింది. ఆయన నివసించిన ఇల్లు బేగం పేటలో ఇప్పటికీ ప్రదర్శనకు ఉన్నది.

ఈ దోమల నివారణకు, హాయిగా నిడురపోవడానికి మనం మస్కిటో కాయిల్స్‌, ఇతర దోమల లిక్విడ్ రీఫిల్స్, ఒంటికి ఒడోమస్ లాంటి క్రిములు పూసుకుని బతుకుతున్నాము. ఇవి దోమలను తరిమినప్పటికీ మన ప్రాణం మెల్లిగా తీస్తాయి. దోమలను చంపే విషం అందులో ఉంటుంది. ఆ విషం క్రమంగా మన ఉపిరి తిత్తుల్లోకి పోయి స్లో పాయింజన్ లాగా పని చేస్తుంది. దానివలన మనకు కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి. కాబట్టి వాటిని వాడకుండా మన పూర్వికులు వాడిన పద్దతులే వాడాలి. ఆ అవసరం వచ్చేసింది.

కర్పూరం చాలా గొప్ప మందు. కర్పూరాన్ని గదిలో హారతి లాగా కాల్చండి , సుమారు 15-20 నిమిషాలు వదిలివేయండి. దీంతో దోమలు వెంటనే పారిపోతాయి. అసలు గుడిలో దోమలు ఉండకూడదనే కర్పూరంతో హారతి ఇవ్వడం మన పూజలో ఆచారం. అదే నూనే మంటతో హారతి ఇవ్వరు. అంటే మన ఆచారంలోను సైన్సు దాగి ఉంది.

మరో మంచి పద్దతి వెల్లుల్లి. వెల్లుల్లి వాసనకు దోమలు పారిపోతాయి. దీని కోసం వెల్లుల్లిని మెత్తగా నూరి నీటిలో వేసి మరిగించాలి. ఇప్పుడు ఈ నీటిని ఇంట్లోని ప్రతి మూలలో చల్లండి. దీంతో బయటి నుంచి దోమలు ఇంట్లోకి రావు. పగటిపూట కూడా దోమలు మిమ్మల్ని కుట్టినట్లయితే, మీరు ‘యూకలిప్టస్’ నూనెను వాడాలి. ఈ రెసిపీని స్వీకరించడానికి, యూకలిప్టస్ నూనెలో సమాన పరిమాణంలో నిమ్మకాయను కలపాలి. ఇప్పుడు ఈ నూనెను శరీరానికి రాయండి. దాని ఘాటైన వాసన కారణంగా దోమలు మీ చుట్టూ తిరగవు.

దోమలను తరిమికొట్టడానికి వేపనూనెను ఉపయోగిస్తారు. దీని కోసం వేప , కొబ్బరి నూనెను సమాన పరిమాణంలో కలపాలి. ఇప్పుడు ఈ నూనెను మీ శరీరానికి రాయండి. దీని వల్ల దాదాపు ఎనిమిది గంటల పాటు దోమలు మీ దగ్గర సంచరించవు. ఇది ప్రయాణంలో బాగా ఉపయోగ పడుతుంది. లావెండర్ సువాసన చాలా బలంగా ఉంటుంది, దీని కారణంగా దోమలు చుట్టుముట్టవు , మిమ్మల్ని కుట్టవు. మీరు ఇంట్లో లావెండర్ రూమ్ ఫ్రెషనర్‌ను కూడా ఉంచవచ్చు. అన్నిటికి మించి వేప ఆకును కాల్చి గదిలో పది నిముషాలు పెట్టండి. వరం వరకు దోమలు ఆ ఇంట్లోకి రావు. అల్ ది బెస్ట్.