jowar Benefits : జొన్న రొట్టెలు ఆరోగ్యానికి చాలా మంచిది. గతంలో కంటే ఇప్పుడు జొన్న రొట్టె తినే వారి సంఖ్య అధికమైంది. ఎందుకంటే జొన్నలలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చపాతీ మాత్రమే తినేవారు ఇప్పుడు జొన్న రొట్టెలు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జొన్న రొట్టెలు చాలా బలవద్దకమైన ఆహారం అనే చెప్పాలి. జొన్న రొట్టెల వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. జొన్న పిండితో చేసిన తర్వాత వంటకాలు సులభంగా అరుగుతాయి. దీనివల్ల బరువు పెరగకుండా ఉంటారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జొన్నల్లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయి. దానివల్ల గుండె జబ్బులు రాకుండా స్ట్రోక్ రాకుండా ఉంటాయి. అందుకు క్రమం తప్పకుండా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
జొన్న రొట్టెలతో బోలెడు ప్రయోజనాలు : జొన్న రొట్టెలు తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. జొన్నల్లో గ్లుటెన్ ఉండదు. రక్త ప్రసరణ బాగా మెరుగుపడుతుంది. వీటిలో కాపర్ ,క్యాల్షియం ,జింక్, ఐరన్ ,మెగ్నీషియం, విటమిన్ బి3 వంటివి ఉండడం వల్ల ఎముకలు దృఢంగా తయారవుతాయి. జొన్నల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. రక్తంలోనే చక్కెర స్థాయిని నియంత్రించే గుణం ఉంది. జొన్నల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా ఉండే విధంగా చేస్తుంది.
jowar Benefits : జొన్న రొట్టెతో బోలెడు ప్రయోజనాలు..

అలాగే రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. జొన్నలతో డయాబెటిస్ ఉన్న వాళ్ళకి షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి జొన్న రొట్టె డయాబెటిస్ వాళ్లకి ఎంతో మేలు చేస్తుంది. జొన్నల్లో 14 ఫైబర్ అధికంగా ఉండడంలో శరీరానికి ఎనర్జిటిక్ గా పనిచేస్తుంది. అజీర్తి గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం అంటే సమస్యలను దూరం చేస్తుంది. జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. విరోగ నిరోధక శక్తిని పెంచడంలో అమితంగా పనిచేస్తాయి. వీటితో పాటు గుండె జబ్బులు క్యాన్సర్ వంటి సమస్యలను అరికడుతుంది