Migraine : ప్రస్తుత ఆధునిక కాలంలో మారిన జీవన శైలి… పనిలో ఒత్తిడి కారణంగా తలనొప్పి వస్తుంది. కొన్నిసార్లు త్వరగా తగ్గిన… మరి కొన్నిసార్లు మాత్రం అధికమవుతుంది. సాధారణంగా తలనొప్పి త్వరగా అనే తగ్గుతుంది. కానీ మైగ్రేన్ నొప్పి త్వరగా తగ్గదు. అసలు మైగ్రేన్ తలనొప్పి ఎందుకు వస్తుందనే విషయం పై ఎటువంటి సమాచారం లేదు. కొన్ని పర్యావరణాల కారణాలవల్ల, జన్యుపరమైన కారణాలు వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజు మన శరీరానికి కావాల్సిన మీరు తాగలేకపోయినా ఈ నొప్పి వస్తుంది.
బాడీ డి హై డ్రేషన్ బారిన పడి తలనొప్పి మొదలవుతుంది. అయితే శరీరానికి కావాల్సిన మోతాదులోని నీటిని తాగితే తలనొప్పి రాకుండా చూసుకోవచ్చు. రోజు ఒకే సమయానికి నిద్ర లేవాలి. కొందరు ఒకరోజు ఉదయాన్నే నిద్ర లేస్తే. మరొక రోజు లేటుగా నిద్ర లేస్తారు. ఇలా రోజు ఒకే సమయంలో నిద్ర లేవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీంతో తలనొప్పి రాకుండా ఉంటుంది. కొందరు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తినరు. ఇటువంటి సమయంలో కూడా తలనొప్పి వస్తుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఖచ్చితంగా తినాలి. బ్రేక్ ఫాస్ట చేయడం మానేస్తే ఒత్తిడి ఎక్కువై తలనొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
Migraine : మైగ్రేన్ మిమ్మలను బాధిస్తుందా..? ఈ సూచనలను పాటిస్తే ఉపశమనం పొందవచ్చు.

మొబైల్స్ ,కంప్యూటర్ ఎదుట అస్తమానం పనిచేసే వారికి సహజంగానే తలనొప్పి వస్తుంది. అటువంటి సమయంలో పని నుండి కొంచెం విశ్రాంతి తీసుకోవాలి. లేదా కంప్యూటర్ కి కొంత దూరంలో ఉండి పని చేయాలి. తద్వారా కళ్ళపై ఏర్పడి ఒత్తిడి తగ్గి ఈ నొప్పి రాకుండా ఉంటుంది. రోజు ఎక్కువసార్లు కాఫీ తాగిన లేద మద్యం సేవించిన మైగ్రేన్ వచ్చేందుకు అవకాశాలు అధికంగా ఉన్నాయని సైంటిస్టుల పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా మద్యం సేవించిన వారికి మైగ్రేన్ వచ్చే అవకాశం 40 శాతం ఎక్కువగా ఉంటుందని నిపుణులు హెచ్చరించారు.
అందుకని మద్యం తీసుకోవడం పూర్తిగా మానేయడం మంచిది. మైనోసోడియం, గ్లూటమేట్ ఉన్న ఆహారలకు దూరంగా ఉండడం వల్ల చాలా వరకు ఈ మైగ్రేన్ నుండి ఉపశమనం పొందవచ్చు. అనేక ఆహారాల రంగు ,రుచిని కాపాడే నైట్రేటీలు రక్తంలోకి నైట్రిక్ ఆక్సిడెంట్ ని పంపి రక్తనాళాలలో వ్యాపించి మైగ్రేన్ కు అవకాశం తెచ్చి పెడుతుందని పలు పరిశోధనలు తెలిపాయి. కాబట్టి ఇటువంటి ఆహారాలను దూరంగా ఉంచాలి.చాక్లెట్లు ఎక్కువగా తినే వారిలో మైగ్రేన్ వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. తద్వారా చాక్లెట్లు అధికంగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
Solutions of Migraine Pain