Health Care : మన ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే మనం తీసుకునే ఆహారం కూడా అంతే మంచిదై ఉండాలి. సరైన ఫుడ్ తీసుకోకపోవడం వలన గుండె సంబంధిత వ్యాధులు చుట్టూముడుతూ ఉంటాయి. గుండె సంబంధిత వ్యాధులకు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. సరియైన ఆహారం తీసుకోవడం వల్ల గుండెను అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. అయితే గుండెను ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచడంలో ఈ పప్పులు చాలా బాగా సహాయపడతాయి అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ పప్పులు గుండెతో పాటు శరీరాన్ని కూడా ఆరోగ్యవంతంగా ఉంచడానికి చాలా బాగా సహాయపడతాయి. గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టాలంటే ఎటువంటి పప్పు దినుసులు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం…
మైసూర్ పప్పు: ఈ మైసూర్ పప్పు అంటే అందరూ ఇష్టపడతారు. ఈ పప్పు తినడం వలన తేలికగా జీర్ణం అవుతుంది. ఈ పప్పు వండుకోవడం కూడా చాలా ఈజీ. ఈ పప్పులో కార్బోహైడ్రేట్, ఫైబర్, క్యాల్షియం, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఈ పప్పులు గుండెను ఆరోగ్యవంతంగా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మినప్పప్పు: ఈ పప్పు తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ పప్పుని నిత్యము ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యవంతమైన గుండెను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ పప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండెను పదిలంగా ఉంచడానికి ఉపయోగపడతాయి.
Health Care : రోజు ఈ పప్పులని తీసుకుంటే గుండె సంబంధిత వ్యాధులు కి చెక్…

అలాగే ఈ పప్పు తీసుకోవడం వలన కొలెస్ట్రాల్, రక్తపోటు నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే ఈ పప్పుని రాత్రి సమయంలో అస్సలు తీసుకోవద్దు. పెసరపప్పు: ఈ పప్పు చాలా ఈజీగా డైజేషన్ అవుతుంది. ఈ పప్పుని వృద్ధుల దగ్గర నుంచి పిల్లల వరకు ఇవ్వచ్చు. ఈ పప్పు తినడానికి కూడా అద్భుతమైన రుచిని కలిగి ఉంటుంది. దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ పప్పు అనారోగ్యంతో బాధపడే వారికి తీసుకోవడం వలన చాలా బాగా పనిచేస్తుంది. ఈ పప్పులో మెగ్నీషియం, ప్రోటీన్, పోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది తీసుకోవడం వలన గుండె పదిలంగా ఉంటుంది. కావున దీనిని నిత్యము ఆహారంలో చేర్చుకున్నట్లైతే చాలా మంచిది.