Barley Grass Juice : గోధుమ గడ్డి లాగానే బార్లీ గడ్డితో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. బార్లీ గింజలతో జావతాగవచ్చు. కానీ బార్లీ గడ్డి తో కూడా జ్యూస్ చేసుకుని తాగుతున్నారు. బార్లీ జ్యూస్ మన శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలను అందజేస్తుంది. ఆమైనో యాసిడ్లు, క్లోరోఫిల్, ఆంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ విటమిన్స్ తో పాటు, ఐరన్ కాపర్ ,పోలిక్ యాసిడ్, బీ 6 , బి12 వంటి ప్రోటీన్లు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. ఈ జ్యూస్ రోజు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి అలాగే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
అంతేకాకుండా గుండె జబ్బులు, డయాబెటిస్ రాకుండా దీనిలో ఉన్న పోషకాలు షుగర్ లెవెల్స్ ని తగ్గించడమే కాకుండా కిడ్నీ సమస్య, కంటి చూపు సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. ఈ గడ్డిలో ఉండే ప్లేవనాయిడ్లు అనబడే యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలో ఉత్పన్నమై ఫ్రీ రాడికల్ ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతో మనం తినే ఆహారం నుండి ఎక్కువ శక్తి లభ్యమయ్యేలా చేస్తాయి. అలాగే శరీర కణజాలాలకు రక్షణ ఇస్తాయి. క్యాన్సర్ ,గుండె జబ్బులు, మధుమోహం వంటి వ్యాధులు రాకుండా చేస్తాయి.
Barley Grass Juice : బార్లీ గడ్డి జ్యూస్ తో బోలెడు ప్రయోజనాలు.

అధిక డిప్రెషన్ తో బాధపడుతున్న వారు రోజు ఈ గడ్డి జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. నిత్య ఈ జ్యూస్ తాగితే షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయవచ్చు. కిడ్నీ వ్యాధులు. కంటిచూపు సమస్యలు రాకుండా ఉంటాయి. మలబద్ధక సమస్యతో బాధపడేవారు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, అధిక బరువు త్వరగా దక్కాలనుకునేవారు ఈ గడ్డి జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. చర్మం మెరిసేలా అందంగా తయారవడానికి ఈ బార్లీ గడ్డి జ్యూస్ తాగితే త్వరగా ఫలితం ఉంటుంది.