high BP : ఈ రోజుల్లో చాలామందిని హైబీపీ సమస్యలు వెంటాడుతున్నాయి. ఎక్కువ ఒత్తిడికి గురి అయినట్లయితే హై బీపీ వస్తుంది. సాధారణంగా 140/90 కంటే ఎక్కువ ప్రెషర్ ఉండడాన్నే హైబీపీ అంటారు. టెన్షన్స్, ఆందోళన, మద్యం అధికంగా సేవించడం.. వంటి అనేక కారణాలవల్ల హై బీపీ వస్తుంది. అయితే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలు తీసుకోవడం వల్ల హైబీపీ సమస్య నుండి బయటపడవచ్చు. అపదార్ధాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
దాల్చిన చెక్క లో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. రోజు ఆహారంలో దీన్ని తీసుకోవడం వల్ల హై బీపీ కంట్రోల్ లో ఉంటుంది. రోజు దాల్చిన చెక్క పొడి తేనె ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని తాగడం వల్ల హైబీపీ తో పాటు పీసీవోడి, షుగర్ వంటి వ్యాధులు నుండి బయటపడవచ్చు. దాల్చిన చెక్క పొడి ఒమేగా త్రీ, ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి. అలాగే అవిసేగింజలు వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవిసె గింజలను దోరగా వేయించి తీసుకోవచ్చు లేదా పొడిచేసి మజ్జిగలో కలుపుకొని తాగవచ్చు.
high BP : ఈ పదార్థాలను తీసుకుంటే చాలు… హైబీపీ కి చెక్ పెట్టవచ్చు.

రోజు మనం తినే ఆహారంలో యాలకులున యాడ్ చేసుకోవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండి గుండె పనితీరుని మెరుగుపరుస్తాయి. అలాగే వీటిలో ఉండే ఫైబర్ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాలను తగ్గిస్తుంది. వెల్లుల్లి హైబీపీ సమస్యను తగ్గిస్తుంది. రోజు రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలను పరిగడుపున పచ్చిగా తినడం వల్ల హై బీపీ, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు తలెత్తవు. అరటిలో ఉండే సోడియం చెడు ప్రభావాన్ని ఎదుర్కోవడంతో సహాయపడుతుంది.
బ్లూ బెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆంతోసైనాసిస్ అని పిలవబడే ఫ్లేవాయిడ్లును కలిగి ఉంటాయి. ఇవి ఐబీపీ రాకుండా చేస్తాయి. అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు త్న ణధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. ఓట్స్, గోధుమపిండితో తయారుచేసిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. హైబీపీ సమస్యతో బాధపడేవారు ఉప్పు తక్కువగా తీసుకోవాలి. తరచుగా ఆకుకూరలు భోజనంలో ఉండేలా చూసుకోవాలి.