Health care tips : మొలకలు ఎప్పుడు తినాలి,ఎలా తినాలి.. ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.

Health care tips : ఈ రోజుల్లో చాలామంది మొలకెత్తిన విత్తనాలను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటున్నారు. మొలకెత్తిన విత్తనాలను ఆహారంగా తీసుకోవచ్చు. శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఈ విత్తనాలలో లభిస్తాయి. వీటిని తరచుగా మనం తినే ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి అందరికీ తెలియడం ద్వారా ఈరోజుల్లో చాలామంది వీటిని తినడం అలవాటు చేసుకున్నారు.చాలామంది వీటిని ఎలా తినాలో తెలియక కొన్ని పొరపాట్లు చేస్తున్నారు.

ఇటువంటి పొరపాట్లు వల్ల గ్యాస్ ,యాసిడిటీ ,అజీర్తి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి మొలకలను ఎప్పుడు ,ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.మొలకెత్తిన విత్తనాలను నేరుగా తీసుకోకుండా వీటిని జ్యూస్ రూపంలో తీసుకుంటున్నారు ఇటువంటి పొరపాట్లు చేయడం వల్ల వీటిలో ఉండే పోషకాలు శరీరానికి అందవు. మొలకెత్తిన విత్తనాలు నమలి తిన్నప్పుడు నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఈ లాలాజలం మొలకెత్తిన విత్తనాల్లో ఉండే కార్బోహైడ్రేట్స్ ని జీర్ణం చేయడానికి బాగా ఉపయోగపడతాయి.

Health care tips : మొలకలు ఎప్పుడు తినాలి,ఎలా తినాలి.. ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు.

When and how to eat sprouts. Don't make these mistakes at all
When and how to eat sprouts. Don’t make these mistakes at all

జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్లు జీర్ణం కావు. కాబట్టి బాడీ వీటిని గ్రహించలేదు.ఈ విత్తనాలను నమలినప్పుడు వీటిని జీర్ణం చేయడానికి జీర్ణాశయం, పేగుల్లో ఉండే రసాయనాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఈ విత్తనాలని జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల ఇందులో ఉండే పోషకాలని శరీరాన్ని చేరలేవు.ఈ పోషకాలాన్ని మలం ద్వారా బయటికి పోతాయి.

ఈ విత్తనాలను జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల వాంతులు, విరోచనాలు అవుతాయి. కాబట్టి మొలకెత్తిన విత్తనాలను జ్యూస్ రూపంలో కాకుండా నేరుగా నమిలి తీసుకోవాలి.వీటిలో తేనె ,ఖర్జూరం, ఎండుద్రాక్షలు, నిమ్మరసం, ఉల్లిపాయలు వంటివి కలిపి తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈజీగా తినవచ్చు. మొలకెత్తిన గింజలని నేరుగా నమిలి తినడమే చాలా మంచిది. వీటిని జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.