Pulasa Fish: సాధారణంగా పులస చేపకు ఎంత డిమాండ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వానాకాలం ప్రారంభంలో గోదావరి నదిలో ఈ చేప దొరుకుతుంది. గోదావరి తీర ప్రాంతాల్లో ఈ చేప కోసం జనాలు ఎగబడతారు. పుస్తెలు అమ్మి అయినా సరే పులస తినాలి అనే సామెత గురించి తెలిసిందే కదా. పులస చేపకు ఉండే క్రేజే వేరు.
సముద్రంలో ఎదురు ఈదుతూ.. కొత్త నీటిని వెతుక్కుంటూ ఈ చేప నదిలోకి చేరుతుంది. ఉప్పు నీటి నుంచి మంచి నీటిలోకి చేరగానే ఈ చేపకు డిమాండ్ అమాంతం పెరుగుతుంది. ఇది దొరకడం చాలా అరుదు. తాజాగా యానాంలోని ఓ చేపల మార్కెట్ లో దానికి రికార్డు ధర పలికింది. కేవలం రెండు కిలోల బరువు ఉన్న పులస చాపకు రూ.19 వేల ధర పలికింది. భైరవపాలెం అనే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దాన్ని రూ.19 వేలకు కక్కించుకున్నాడుు.
Pulasa Fish: గత ఏడాది రూ.25 వేలు పలికిన పులస చేప
గత సంవత్సరం అయితే ఒక్కో పులస చేపకు రూ.25 వేలు పలికింది. పులస చేపలు ఎక్కువగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దొరుకుతుంటాయి. గోదావరి జలాలు సముద్రంలో కలిసే రెండు పాయల దగ్గరే ఈ పులస చేప మత్స్యకారులకు దొరుకుతుంది. పులస చేపలు గోదావరి జిల్లాల్లోనే కాదు.. ఒడిశాలో కూడా దొరుకుతుంటాయి. వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ లోనూ ఈ చేపలకు ఉన్న డిమాండ్ వేరు.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాల్లో సముద్రాల్లోనూ ఈ చేప లభిస్తుంది. సముద్రాల నుంచి ఎదురు ఈదుతూ ఈ చేప గోదావరి నదిలోకి చేరుతుంది. ఇక్కడ ఆషాడ మాసాలు, శ్రావణ మాసాల్లో గుడ్లు పెట్టి సముద్రంలోకి వెళ్లిపోతుంది. ఆ సమయంలో గోదావరి నదిలోనే పులసగా మారుతుంది. అప్పుడే ఈ చేపకు డిమాండ్ పెరుగుతుంది. ఆ సమయంలో ఈ చేప దొరికితే పంట పండినట్టే. మూడు నాలుగు చేపలు దొరికినా.. ఆ మత్స్యకారుడు లక్షాధికారి అయినట్టే.