Tollywood : ప్రముఖ నటి సూసైడ్ .. కారణం ఏంటో తెలిస్తే కన్నీళ్లు పెట్టుకుంటారు ..

Tollywood : తాజాగా సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. వినోద రంగంలో ఇప్పుడిప్పుడే రాణిస్తున్న వర్తమాన తార ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మరణం సినీ వర్గాలను, అభిమానులను, శ్రేయోభిలాషులను, స్నేహితులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. యువ నటి మృతికి దిగ్భ్రాంతులైన సినీ నటులు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడును ప్రార్థిస్తున్నారు. ఈ యువ హీరోయిన్ మలయాళ పరిశ్రమకు చెందినవారు. రెంజూష మీనన్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఆమె మరణం సంచలనం రేపింది. ఆమె తన నివాసంలో ఉరి వేసుకుని మరణించడం అత్యంత విషాదకరంగా మారింది.

Advertisement

actress-renjusha-menon-suicide-news

Advertisement

రెంజూష మీనన్ మరణం పై ఆమె భర్త మనోజ్ మీడియా కి వెల్లడించారు. అయితే ఆమె మరణానికి గల కారణాలు ఏంటో పూర్తిగా తెలియలేదు. మీడియా వర్గాల కథనం ప్రకారం రెంజూష మీనన్ మరణానికి కారణం ఆర్థిక సమస్యలే అని తెలుస్తుంది. ఆమె కుటుంబం కొద్ది కాలంగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆర్థిక సమస్యలే ఆమె మరణానికి కారణమా లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అని కేరళ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. కొచ్చిన్ కి చెందిన ఈమె టెలివిజన్ షోల ద్వారా వినోద రంగంలోకి అడుగు పెట్టారు. టీవీ సీరియల్స్ లలో నటిస్తూ మంచి పేరును తెచ్చుకున్నారు.

సీరియల్స్ లలో నటిస్తూనే సినిమాలోకి అడుగు పెట్టారు .ఈమె సిటీ ఆఫ్ గాడ్, నేరుకుందోరు కుంజాడు, బాంబే మార్చ్, వన్ వే టికెట్ వంటి తదితర సినిమాలలో నటించారు. ఆమె చేసిన పాత్రలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే ఇటీవల మలయాళ పరిశ్రమలో సూసైడ్ వార్తలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. మలయాళ పరిశ్రమకు చెందిన అపర్ణా నాయర్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె మృతి చెందిన కొద్దిరోజులకే రెంజూష మీనన్ మరణించడం మలయాళ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

 

Advertisement