Ys Avinash Reddy : అవినాష్ రెడ్డికి ఊరట.. కానీ…?

తెలంగాణ హైకోర్టులో వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. వివేకా హత్యకేసులో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన వెకేషన్ బెంచ్.. ఈమేరకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇస్తూ తీర్పునిచ్చింది. ప్రతివారం సీబీఐ ఎదుట హాజరు కావాలని.. చెప్పకుండా విదేశాలకు వెళ్లకూడదని అవినాష్ రెడ్డిని ఆదేశించింది.

Advertisement

Advertisement

ప్రధానంగా అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కారణం..తన తల్లికి ఆపరేషన్ జరుగుతోందని ఇప్పుడున్న పరిస్థితుల్లో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే, అవినాష్ రెడ్డి తల్లికి ఆపరేషన్ జరగలేదని, వెంటనే ఆతనిపై చర్యలు తీసుకోవాలని సునీత తరుఫు న్యాయవాదులు వాదించారు. దీనిపై స్పందించిన వెకేషన్ బెంచ్.. అవినాష్ తల్లికి సర్జరీ జరగలేదని తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడం పట్ల తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సీబీఐ ఈ స్టెప్ తీసుకోకపోయినా… సునీత మాత్రం తప్పకుండా సుప్రీంను ఆశ్రయించడం ఖాయం. ఇప్పటికే అవినాష్ రెడ్డి దాఖలు చేస్తోన్న బెయిల్ పిటిషన్లపై హైకోర్టు స్పందించిన తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. దీంతో సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు వస్తుందన్నది ఆసక్తి రేపుతోంది.

Advertisement