Lakshmi Pooja : ప్రతి మనిషికి జీవితంలో ముఖ్యమైన వాటిలో ఒకటి డబ్బు. డబ్బు ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషికి తన జీవితంలో వచ్చే ఇబ్బందులను, ఒడిదుడుకులను ఎదుర్కొవాలంటే డబ్బు చాలా అవసరం. మన దగ్గర డబ్బు లేకపోతే కొన్ని సార్లు మన సొంత వాళ్లు కూడా మనల్ని దూరంగా ఉంచుతారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే జీవితంలో ఆర్థిక సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి. అంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో చిరకాలం నిలిచి ఉండాలి. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా ఈ నియమాలను పాటించాలి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1) మనపై లక్ష్మీ దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ కలగాలంటే ప్రతి శుక్రవారం ఉదయాన్నే లేచి తలస్నానం ఆచరించాలి. తర్వాత గులాబీ లేదా తెలుపు రంగు దుస్తులను ధరించాలి. లక్ష్మీదేవికి నమస్కరించి ఆమెకు ఎంతో ప్రీతికరమైన తామరపూలు సమర్పించాలి. తర్వాత పూజ ముగిసే వరకు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని ఆరాధించాలి.
Lakshmi Pooja : మీ ఇంట్లో డబ్బు కొరత ఉంటే… ఈ 4 పనులు చేయండి

2) అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెరుగులో కొద్దిగా పంచదారను వేసి బాగా కలుపుకుని తాగాలి. ఇలా చేస్తే మీరు వెళ్లిన పని నెరవేరుతుంది. ఎటువంటి ఆటంకాలు కలగవు. అలాగే శుక్రవారం రోజున నల్ల చీమలకు పంచదార తినిపిస్తే మనకు మంచి జరుగుతుంది.
3) మీరు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లైతే శుక్రవారంనాడు లక్ష్మీదేవికి శంఖువు, చక్రం, తామర పువ్వులను అర్పించాలి. ఇంటి ప్రధాన ద్వారం వద్ద నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. దీపం చల్లారిన తర్వాత దాన్ని పారే నీటిలో కలపాలి.
4) చాలామంది తమ ఇంటిలో తినగా మిగిలిన ఆహారాన్ని పారేస్తుంటారు. ఇలా చేస్తే లక్ష్మీదేవికి అగ్రహం కలుగుతుంది. కోపంతో అన్నంను కొట్టడం లేదా పారి వేయడం వంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే ఇంట్లో ధనం నిలిచి ఉండదు. మిగిలిన ఆహారాన్ని ఆకలి తో బాధపడుతున్న వారికి ఇస్తే మంచి జరుగుతుంది.