THALAIVAR171 : సూపర్ స్టార్ బర్త్ డే కానుకగా బిగ్ అనౌన్స్ మెంట్…లోకేష్ కనకరాజు దర్శకత్వంలో THALAIVAR171…

THALAIVAR171 : సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం తన 170 సినిమాను జ్ఞావెల్ డైరెక్షన్ లో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బాద్షా బిగ్ బి అమితాబచ్చన్ కూడా నటించనున్నారు. రజనీకాంత్ మరియు అమితాబచ్చన్ కలిసి నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు కూడా భారీ ఎత్తున ఉన్నాయి. ఇక ఈ సినిమాలో సస్పెండ్ అయిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో రజనీకాంత్ కనిపిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను తాజాగా సూపర్ స్టార్ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న విడుదల చేస్తారని తెలుస్తోంది.

Advertisement

big-announcement-as-superstar-birthday-gift-thalaivar171-directed-by-lokesh-kanakaraju
తన 170 సినిమా తర్వాత రజనీకాంత్ 171వ సినిమాని లోకేష్ కనకరాజు డైరెక్ట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన టైటిల్ పోస్టర్ కూడా విడుదలైంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని త్వరలోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ కూడా చేయబోతున్నట్లు సమాచారం. అయితే త్వరలో సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్డే ఉండడంతో అదే రోజు సినిమా ముహూర్తం పెడతారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక లోకేష్ కనకరాజు సినిమాలకు ఆడియన్స్ లో ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. ఇక ఇప్పుడు రజనీకాంత్ తో లోకేష్ కనకరాజు ఒక గ్యాంగ్ స్టర్ కథతో వస్తున్నట్లుగా సమాచారం.

Advertisement

big-announcement-as-superstar-birthday-gift-thalaivar171-directed-by-lokesh-kanakaraju

ఖైదీ , మాస్టర్ , విక్రమ్ , లియో వంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో ఆడియన్స్ అలరిస్తున్న లోకేష్ కనకరాజు మరోసారి రజనీకాంత్ తో రచ్చ చేసినందుకు రెడీగా ఉన్నారు. లోకేష్ కనకరాజు సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఈ సినిమా కూడా ఉండబోతుందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ఇక ఈ సినిమాతో 1000 కోట్ల మార్క్ కూడా రీచ్ అవ్వాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే తాజాగా జైలర్ సినిమాతో సూపర్ ఫారం లోకి వచ్చిన రజనీకాంత్ ముందు ముందు పెద్ద టార్గెట్ లను పెట్టుకున్నాడని అర్థమవుతుంది. జైలర్ తర్వాత రాబోయే రెండు సినిమాలు కూడా అదే తరహాలో కొనసాగుతాయని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Advertisement