లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రను తేల్చిన సీబీఐ కోర్టు ..!!

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ స్కామ్ లో కవిత హస్తం ఉందని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని సీబీఐ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. ఇప్పటివరకు ఈడీ, సీబీఐలు కవితను సాక్షిగా మాత్రమే పరిగణించాయి. సీబీఐ న్యాయమూర్తి మాత్రం కవిత ఈ స్కామ్ లో నిందితురాలు అనే విధంగా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.

Advertisement

అరుణ్ పిళ్ళై బెయిల్ పిటిషన్ పై విచారణ సందర్భంగా సీబీఐ ప్రత్యేక కోర్టు…లిక్కర్ స్కామ్ లో కవిత ప్రమేయం ఉందని అభిప్రాయపడింది. పిళ్ళై బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన న్యాయస్థానం..పిళ్ళై పేరిట ఎలాంటి ఆస్తులు కొనుగోలు చేయలేదని ఈడీ పేర్కొనటం చూస్తే కవిత కోసం బినామీ లావాదేవీకి పాల్పడినట్లు స్పష్టం అవుతుందని పేర్కొంది. అలాగే, స్కామ్ ద్వారా ఆర్జించిన లాభాలతోనే కవిత కోసం ఆస్తులను కొనుగోలు చేశారని చెప్పేందుకు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది.

Advertisement

నిధులు బదిలీ జరిగిన తీరు చూస్తుంటే కవిత ఆదేశాలతోనే పిళ్ళై ఆస్తులను కొనుగోలు చేసినట్లు అర్థం అవుతుందని బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ సీబీఐ కోర్టు వ్యాఖ్యానించింది. ఢిల్లీలోని ఒబెరాయ్ హోటల్ లో కవిత, విజయ్ నాయర్ ల మధ్య జరిగిన భేటీలో పిళ్ళై కూడా పాల్గొన్నట్లు కోర్టు గుర్తించింది. కవిత ప్రతినిధిగానే పిళ్ళై వ్యవహరించారనడానడానికి ఆధారాలు ఉన్నాయని కోర్టు చెప్పడం బీఆర్ఎస్ కు మింగుడు పడని అంశమే.

గత కొద్ది రోజులుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో దర్యాప్తు సంస్థలు దూకుడు తగ్గించాయి కానీ న్యాయస్థానాల్లో మాత్రం లిక్కర్ స్కామ్ నిందితులకు, అనుమానితులకు మాత్రం ఎదురుదెబ్బ తగులుతోంది.

Advertisement