ఆర్జీవీ బట్టలూడదీసి కొడుతామన్న కాంగ్రెస్ నేతలు – ఎందుకంటే..?

ఆర్జీవీ తెరకెక్కిస్తోన్న ‘వ్యూహం’ సినిమాలో సోనియా గాంధీని కుట్రదారుగా చూపిస్తే వర్మ బట్టలూడదీసి కొడుతామని ఏపీ పీసీసీ అద్యక్షుడు గిడుగు రుద్రరాజు హెచ్చరించారు. ఎన్నికల సమయనా జగన్ కు మేలు చేసేందుకు సినిమాను వర్మ రూపొందిస్తున్నారన్న రుద్రరాజు..ఎన్నికల్లో వైసీపీకి మేలు చేకూర్చే ఎత్తుగడే ఈ సినిమా అన్నారు.

Advertisement

హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ మరణించడంతో సోనియా గాంధీపై జగన్ అనుమానాలు వ్యక్తం చేశారని.. రిలయన్స్ పై నిందలు వేసి ఇప్పుడు రిలయన్స్ వాళ్ళకు పదవి ఇచ్చారని రుద్రరాజు గుర్తు చేశారు.పదవి వ్యామోహంతో నాడు సోనియా గాంధీపై ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఎన్నికలు వస్తుండటంతో మైలేజ్ కోసం సినిమాను వాడుకోవాలని అనుకుంటున్నారని చెప్పారు.

Advertisement

‘వ్యూహం’ సినిమాలో సోనియా గాంధీని చెడుగా చూపిస్తే ఊరుకునేది లేదని , సోనియా గాంధీ గురుంచి ఏమాత్రం చెడుగా చూపించినా వర్మను బట్టలూడదీసి కొడుతామని గిడుగు రుద్రరాజు వార్నింగ్ ఇచ్చారు. అసలు వాస్తవాలు వర్మకు తెలుసా..? అని అన్నారు. సోనియా గాంధీపై చెడుగా ప్రచారం చేస్తే తెలంగాణా కాంగ్రెస్ నేతలు కూడా ఊరుకోరని..సినిమాలో సోనియా గాంధీ పాత్ర అనంతరం కాంగ్రెస్ నేతలు స్పందించే అవకాశం ఉందన్నారు.

Advertisement