ఎవరి పనిలో వాళ్ళు బీజీగా ఉండటం వలన ఆఫీస్,ఇంటికే పరిమితమైయే వాళ్ళు చాలామంది ఉన్నారు.వాస్తవానికి ఒక రోజు సెలవు దొరికితే చాలు సరదాగా బయటకు వెళ్లి అల గడిపెయాలి అనుకుంటారు.ఇంకా ఎక్కువ రోజులు సెలవులు వుంటే ఏకంగా లాంగ్ ట్రిప్స్ వేసుకుంటారు.సరదాగా తిరగాలని ప్రతి ఒక్కరికి ఉంటది.మరికొందరు ఏకంగా దేశంలోని విదేశాల్లోని పలు ప్రాంతాలు చుట్టి రావాలని చూస్తుంటారు.కాకపోతే వీసా, పాస్ పోర్టు తప్పక ఉండాలి కదా.అందువల్ల చాలా మంది ఆగిపోతారు.
అయితే దేశ విదేశాల్లో తిరిగాలి అనుకునేవాళ్లు వీసా, పాస్ పోర్టు లేకుండా తిరిగే దేశాలు చాలా ఉన్నాయి.ఇంకా ఆలస్యం చేయకుండా వేసవి సెలవులో వీసా, పాస్ పోర్టుతో పని లేని వీలైన దేశాలన్నీ తిరిగి రండి.
వీసా, పాస్ పోర్టు లేకుండా తిరిగే దేశాలెంటో ఇక్కడ చూదాం ..
*భూటాన్ దేశం పోవడం ఉత్తమం. ఎందుకంటే భారతదేశానికి పొరుగునే ఉన్న దేశం కావడంతో ఇక్కడ పర్యటించడం మనకు పెద్దకష్టమేమీ కాదు.
*ఫిజీలో 120 రోజుల పాటు వీసా లేకుండా ప్రయాణించొచ్చు. దాదాపు నాలుగు నెలలపాటు వీసా లేకుండా నచ్చిన ప్లేస్ లను సందర్శించవచ్చు.
*బార్బడోస్ కరేబియన్ దేశాలలో ఒకటి. ఇక్కడ వీసా లేకుండా 90 రోజులు విలాసమైన జీవితాన్ని గడుపోచ్చు.
*సెయింట్ విన్సెంట్ లో వీసా లేకుండా 30 రోజులు ఉండగలం. ఇక్కడ కూడా చూడదగ్గ సుందరమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి.
*ట్రినిడాట్, టొబాగో ఒక ద్వీప దేశం. ఇక్కడ కూడా వీసా లేకుండా 90 రోజులు ప్రయాణం చేయొచ్చు.
*కజకిస్తాన్ లో 14 రోజుల పాటు వీసా లేకుండా తిరగొచ్చు.
ఇంకేముంది భారతీయులు సమ్మర్ సెలవుల్లో ఏం చక్క పైన ఉన్న దేశాల్లో వీసా, పాస్ పోర్టు లేకుండా ప్రయాణం చేయొచ్చు.