Google : ప్రస్తుతం మారిన కాలం కారణంగా ప్రతి ఒక్కరు ఇంటర్నెట్ ని బాగా వినియోగిస్తున్నారు. అందులో ముఖ్యంగా నెటిజన్లు గూగుల్ ని బాగా ఆశ్రయిస్తున్నారు. ఏదైనా తెలియని విషయం ఉంటే వెంటనే గూగుల్ లో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. ఫుడ్ దగ్గర నుంచి షాప్, ట్రావెల్, టెక్నాలజీకి సంబంధించిన అంశాలను గూగుల్లో సెర్చ్ చేసి సమాచారాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత అంశాలకు సంబంధించిన సందేహాలను తెలుసుకోవడానికి గూగుల్ ని ఎక్కువగా వాడుతున్నారు. తమలోని సందేహాలను ఇతరులతో పంచుకోవడం ఇష్టం లేనివారు గూగుల్ లో సెర్చ్ చేసి మరీ క్లారిటీ తెచ్చుకుంటున్నారు. అయితే గూగుల్లో నెటిజన్స్ ఎక్కువగా సెక్స్ వాలిటీ గురించి శోధిస్తున్నట్లు తాజా పరిశోధనలో తేలింది.
వ్యక్తిగత, లైంగిక అంశాలకు సంబంధించిన శోధనలు భారీగా పెరిగిపోయాయని మార్కెట్ రీసెర్చ్ కంపెనీ కల్చరల్ కరెంట్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. సెక్స్ వాలిటీ జనరల్ సంబంధిత అంశాలపై ఎక్కువగా వెతుకుతున్నారని పేర్కొంది. అమెరికాలో 50 రాష్ట్రాల్లోని ప్రజలు 2004 గురించి 2023 వరకు చేసిన శోధనలపై గూగుల్ ట్రెండ్స్ డేటాను కల్చరల్ కరెన్సీ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. అందులో ఎక్కువగా am I gay , am I lesbian , am I transgender , how to come out , non binary పదాలను అమెరికా వాళ్లు ఎక్కువగా సెర్చ్ చేశారని సిసిఐ తెలిపింది.
తమలోని లక్షణాలపై అనుమానం వ్యక్తం చేస్తూ వాటిని నిర్ధారించుకోవడానికి ఇలా సెర్చ్ చేశారట. ఈ పదాలతో వెతికి అందుకు సంబంధించిన సమాచారం గురించి తెలుసు కోవడానికి అమెరికాలో విపరీతంగా ప్రయత్నించారని తెలిసింది. అయితే పరిమితంగా కొన్ని రాష్ట్రాలలో ఈ పదాల గురించి ఎక్కువగా సెర్చ్ చేశారట. సామాజిక విలువల పరిరక్షణలో అమెరికాలో ముందున్న రాష్ట్రమైన ఉటాహ్ ఈ పదాల గురించి ఎక్కువగా వెతికారని తెలిపింది. అలాగే how to come out అనే పదాన్ని ఒక్లాహోమా వాసులు ఎక్కువగా వెతికారట. ఈ రాష్ట్రంలో సెల్ఫ్ ఐడెంటీనీ బహిర్గతం చేసుకునేందుకు కాస్త వెనకాడుతారు అంటే పరిస్థితులు అంత కఠినంగా ఉంటాయి.