Telangana Elections : తెలంగాణ ఎన్నికలకు ఈవీఎంను సిద్దం చేస్తోన్న ఈసీ

త్వరలో తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. డిప్యూటీ కమిషనర్ నితీష్ వ్యాస్ నేతృత్వంలో ఎన్నికల అధికారులు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయంలో ఎన్నికల ఆఫీసర్ వికాస్ రాజ్ , ఇతర అధికారులతో సమావేశమయ్యారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

Advertisement

తెలంగాణలో ఓటర్లు, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు. ఓటర్ జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా జాబితాను సిద్దం చేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారులను ఆదేశించారు. రిటర్నింగ్ అధికారుల జాబితాను కూడా సిద్దం చేయాలని ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతోన్న నేపథ్యంలో జూన్ 1నుంచి ఈవీఎంల మొదటి దశ తనిఖీ చేపట్టాలని సూచించారు. ఈవీఎంలపై అవగాహనా కోసం అధికారులకు రెండు రోజులపాటు అవహగన కల్పించాలని చెప్పారు.

Advertisement

ఎలక్షన్ ఓటింగ్ మిషన్ లను పరిక్షించామని ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు. వాటిని జిల్లాలకు కూడా పంపామని వెల్లడించారు. ఈవీఎంలో సమస్యలు తలెత్తితే ఎలా సాల్వ్ చేయాలి..? లోపాలు తలెత్తకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి..?అనే అంశాలపై అధికారులకు శిక్షణ ఇస్తామని వెల్లడించారు. పోలింగ్ రోజున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడుతామని ఇప్పటి నుంచే అధికారులకు శిక్షణ కల్పిస్తామని చెప్పుకొచ్చారు.

తెలంగాణలో ఈ సంవత్సరం చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. దీంతో ఎన్నికల సన్నాహాలను ముందుగానే ఈసీ ప్రారంభించింది. అందులో భాగంగానే సమీక్ష సమావేశాలు నిర్వహిస్తోంది.

Advertisement