Asian Games 2023 : ఏసియన్ గేమ్స్ 2023 లో భాగంగా జరుగుతున్న క్రీడలలో భారత్ అదరగొడుతుంది. మునుపెన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారి భారత్ పథకాల సంఖ్య 100 దాటింది. ఇదివరకే మొత్తం 95 పథకాలను సొంతం చేసుకున్న భారత్…ఇటీవల శుక్రవారం రోజున మరో 7 పథకాలను తన ఖాతాలో వేసుకుంది. అచ్చరిలో 3 ,కబడ్డీలో 2, బ్యాట్మెంటన్ మరియు మెన్స్ క్రికెట్ లో ఒక పథకాన్ని సాధించింది. దీంతో ప్రస్తుతం భారత్ పథకాల సంఖ్య ఇప్పటికే 102 కు చేరింది. అంతేకాక చరిత్రలో మొట్టమొదటిసారి భారత్ 20 స్వర్ణ పథకాలను సొంతం చేసుకోగా శుక్రవారం నాటికి భారత్ 22 స్వర్ణం, 34 వెండి ,39 రజత పథకాలను కైవసం చేసుకుంది.
కాగా ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ మెన్స్ మరియు ఉమెన్స్ క్రికెట్ జట్లు పాల్గొనడం ఇదే తొలిసారి కాగా రేపు శనివారం ఫైనల్లో ఆఫ్ఘనిస్తాన్ తో భారత్ మెన్స్ టీం తలపడబోతోంది. ఇప్పటికే మన జట్టుకు వెండి పతకం ఖరారు కాగా రేపు ఆఫ్ఘనిస్తాన్ పై విజయం సాధిస్తే మరో స్వర్ణం భారత్ ఖాతాలో పడుతుంది. ఇక ఏషియన్ గేమ్స్ 2023 పాయింట్లు పట్టికను చూసినట్లయితే చైనా మొత్తం 353 పథకాలతో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత జపాన్ ( 165 ) , దక్షిణ కొరియర్ ( 169 ) , భారత్ ( 95+7 ) గా ఉన్నాయి.