Ravi Teja : సీనియర్ హీరోల సరసన నటిస్తే హీరోయిన్ల కెరియర్ దెబ్బడిపోతుందనడానికి అనేకమంది హీరోయిన్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే తాజాగా మాస్ మహారాజా రవితేజ తో నటించిన కొంతమందిని హీరోయిన్ల కెరియర్ కూడా అదే పరిస్థితి దాపురించిందని చెప్పవచ్చు. రవితేజ వరుస ప్లాపులతో వెనుకబడినప్పటికీ క్రాక్ సినిమా తో మళ్ళీ ఫామ్ లోకి రావటం జరిగింది. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో పాపులర్ అయిన నభా నటేష్ రవితేజ తో డిస్కో సినిమాలో చేయడం జరిగింది. కాగా ఈ సినిమా ప్లాప్ కావడంతో ఎంగేజ్ లోనే ఈ బ్యూటీకి షాక్ తగిలినట్లు అయింది. ఇస్మార్ట్ శంకర్ తో వచ్చిన క్రేజ్ తర్వాత వచ్చిన ఈ సినిమాతో పూర్తిగా కొలాప్స్ అయిందని చెప్పొచ్చు.
ఈ సినిమా తర్వాత చేసిన సినిమాలు నభా నటేష్ కు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇదే సినిమాలో చేసిన పాయల్ రాజ్ పుత్ కూడా ఇదే పరిస్థితి. వెంకటేష్ మరియు నాగచైతన్య కలిసి నటించిన వెంకీ మామ సినిమాలో పాయల్ రాజ్ పుత్ చేసింది. ఈ సినిమా హిట్ అయినప్పటికీ రవితేజ తో నటించిన డిస్కో రాజా అట్టర్ ప్లాప్ కావడంతో ఈ భామ కెరియర్ ని కూడా కష్టాల్లో పడేసినట్లైంది. యంగ్ బ్యూటీ అయినటువంటి మాళవికా శర్మ కూడా రవితేజ సరసన మొదటి సినిమా చేసి తన కెరియర్లో వెనక్కి వెళ్ళిపోయినట్లుగా అనిపిస్తుంది.
Ravi Teja : రవితేజ తో నటించిన ముగ్గురు హీరోయిన్లు కెరియర్ గల్లంతు…
నేల టికెట్ సినిమా ద్వారా తెలుగులోకి వచ్చిన మాళవిక ఈ సినిమా హిట్ అయి ఉంటే తన కెరియర్ ఇంకోలా ఉండేది. కాబట్టి రవితేజ సరసన నటించడంతో ఆమె కెరియర్ ఆదిలోనే దెబ్బ పడినట్లుగా అయింది. చెప్పుకుంటూ పోతే రవితేజ నటించిన ఏ హీరోయిన్ కూడా అంత స్టార్డం సంపాదించలేదని చెప్పొచ్చు. ఈ విధంగా చూస్తే కవితల చేత నటించి కెరియర్ పోగొట్టుకున్న హీరోయిన్ లిస్టు శాంతాడు అంతగా ఉంటుందని చెప్పొచ్చు. విషయం తెలిసిన హీరోయిన్లు రవితేజ సినిమాలకి నో చేపడుతున్నారని సమాచారం.