Samantha : అందుకే వాళ్లకు డబ్బు ఇచ్చా‌… అంటూ కామెంట్స్ చేసిన సమంత …

Samantha : అటు బాలీవుడ్ లో ఇటు టాలీవుడ్ లో తెగ హల్ చల్ చేస్తుంది సమంత. వరుస సిని ఆఫర్లతో బిజీబిజీగా గడుపుతుంది ఈ అమ్మడు. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోను తన సత్తా చాటుకుంటుంది. బాలీవుడ్ లో ‘ ది ఫ్యామిలీ మెన్- 2’ వెబ్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ ఇప్పుడు కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఈ షోలో తన వ్యక్తిగత విషయాలతో పాటు ప్రొఫెషనల్ సంగతులు పంచుకుంది.

అక్కినేని నాగచైతన్య తో విడాకుల విషయంపై తొలిసారి ఓపెన్ అయింది. ప్రేమ, పెళ్లి గురించిన కొన్ని విషయాలపై రియాక్ట్ అయింది. అయితే ఈ షోలో సమంత చేసిన ఓ కామెంట్ వివాదానికి తెరలేపింది. దీంతో ఆమెపై నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. ఆర్ మాక్స్ అనే సంస్థ భారతీయ సినీ హీరోయిన్లలో అత్యంత పాపులారిటీ పొందినవారు ఎవరు అని సర్వే చేస్తే అందులో సమంతని నెంబర్ వన్ గా నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో అలియా భట్, నయనతార, కరీనాకపూర్, పూజ హెగ్డే లు నిలిచారు.

Samantha : అందుకే వాళ్లకు డబ్బు ఇచ్చా‌… అంటూ కామెంట్స్ చేసిన సమంత …

Samantha comments hot topic in coffee with Karan show
Samantha comments hot topic in coffee with Karan show

అయితే ఈ క్రమంలో కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమంత కరణ్ కొన్ని కీలక ప్రశ్నలు అడిగారు. ఆర్ మాక్స్ సంస్థ సర్వేలో నెంబర్ వన్ ప్లేస్ ఎలా సాధించారు అని అడిగారు. దాంతో నిజం చెప్పనా అంటూ ఓపెన్ అయింది సమంత. ఆ సంస్థకు భారీ మొత్తంలో డబ్బు ఇచ్చానని చెప్పింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారానికి తెర లేపాయి. అంటే డబ్బుతో ఆ ప్లేస్ కొన్నట్లుగా ఆమె పరోక్షంగా చెప్పిందని చెప్పుకుంటూ ఆమె ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఇకపోతే నాగచైతన్యను నన్ను ఒకే గదిలో ఉంచితే పదునైన వస్తువులను దాల్చాల్సి ఉంటుంది అని కామెంట్ చేసింది సామ్.

నాగచైతన్యతో విడాకుల తర్వాత ఆమె క్రేజ్ తగ్గుతుందని అనుకున్నారు. కానీ ఆమె జర్నీ అందుకు విరుద్ధంగా సాగుతుంది. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరియర్లో దూసుకు వెళుతుంది. ‘ పుష్ప ‘ సినిమాలో ఐటమ్ సాంగ్ కు డాన్స్ వేసి కుర్రకాలను ఉర్రూతలూగించింది. అలాగే మరో ఐటెం సాంగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘ శాకుంతలం ‘ మూవీ లో కీలకపాత్ర పోషిస్తుంది సమంత. ఇదే కాకుండా లేడీ ఓరియంటెడ్ సినిమా ‘ యశోద ‘ లో కూడా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా అప్డేట్స్ సినిమాను హైప్ చేసాయి