తెలుగు ఛానెల్ లో న్యూడ్ వీడియోస్ ప్రసారం – ఏకంగా పావుగంటపాటు..?

ఓ ప్రముఖ తెలుగు శాటిలైట్ ఛానెల్ లో అర్దరాత్రి పావుగంటపాటు బ్లూఫిలిం ప్రసారం కావడం కలకలం రేపింది. ఈ ఛానెల్ ఆఫీసు బంజారాహిల్స్‌, జూబ్లిహిల్స్ మధ్యలో ఉంది. సరిగ్గా మూడురోజుల కిందట అర్దరాత్రి సమయంలో ఈ అశ్లీల చిత్రాలు ప్రసారం అయ్యాయి.

Advertisement

పేరుమోసిన ఆ ఛానెల్ లో ఏకంగా పదిహేను నిమిషాలపాటు న్యూడ్ వీడియో ప్రసారం అయింది. వాస్తవానికి శాటిలైట్ చానెల్ సిబ్బంది ప్రతిక్షణం అలర్ట్ గా ఉంటారు. ఒక్క నిమిషం ఛానెల్ ప్రసారాలు ఆగిపోయినా, ఇతర కార్యక్రమాలు ప్రసారమైనా పరువు పోతుందని అప్రమత్తంగా ఉంటారు. అందుకే పీసిఆర్ లో అనుభవమున్న వ్యక్తులనే అపాయింట్ చేసుకుంటారు. అలాంటిది మంచి ఆదరణ కల్గిన ఈ ఛానెల్ లో పదిహేను నిమిషాలపాటు బ్లూఫిలిం ప్రసారం కావడం వెనక ఎవరో కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Advertisement

ఛానెల్ ఎయిర్ లోకి వెళ్ళాలంటే ముందుగా సర్వర్ లోకి న్యూస్ ఫీడ్ ను పంపాలి. ఆ తరువాతే పీసిఆర్ ఆపరేటర్ వార్తలను ప్రసారం చేయడానికి వీలుంటుంది. సర్వర్ ను హ్యాక్ చేయడానికి సాధ్యం కాదు. హ్యాక్ చేసిన ఎవరో ఇతరులు చేయడానికి అసలే వీలుండదు. ఆ ఛానెల్ గురించి తెలిసిన వ్యక్తే ఇలా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదంతా ఆఫీసులో పని చేసే సిబ్బంది పనే అయి ఉండొచ్చునని అనుమానాలు బలపడుతున్నాయి.

ఛానెల్ లో బ్లూ ఫిలిం ప్రసారం అయిన వెంటనే యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సర్వర్ హ్యాక్ చేశారని చెప్పింది. కానీ అంతర్గతంగా కొంత మంది ఉద్యోగులు ఇలా కుట్ర చేశారన్న అనుమానాలతో దర్యాప్తు చేయిస్తోంది.

Advertisement