మోడీ చరిష్మా కర్ణాటకలో వర్కౌట్ కావడం లేదా..?

కర్ణాటకలో బీజేపీకి ఓటమి భయం పట్టుకున్నట్లు స్పష్టమౌతుంది. సాధారణంగా ప్రధాని మోడీ రోడ్ షో లలో ఎక్కువగా పాల్గొనరు. ఒకవేళ పాల్గొనాల్సిన పరిస్థితి వస్తే కాసేపు మాత్రమే సమయం కేటాయించి అక్కడి నుంచి భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు కానీ కర్ణాటకలో మాత్రం శనివారం ఆ మూల నుంచి ఈ మూల వరకు రోడ్ షో ప్లాన్ చేశారు. ప్రధాని రోడ్ షో షెడ్యూల్ చూసి రాజకీయ వర్గాలు ఆశ్చర్యపోవడమే కాదు కర్ణాటక ఎన్నికల ఫలితంపై బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా కనబడుతుందని చెప్పుకొస్తున్నారు.

Advertisement

కర్ణాటకలో తనే సీఎం అన్నట్లుగా మోడీ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే కొన్ని సభల్లో పాల్గొన్నారు మోడీ. ఆయన చరిష్మాతో కర్నాటకలో బీజేపీని గెలుపు తీరాలకు చేర్చే అవకాశం ఎంతమాత్రం లేదని బీజేపీకి నిఘా వర్గాలు నివేదించాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి బొమ్మైతోపాటు యడ్యురప్పను రంగంలోకి దింపినా జనాల నుంచి మునుపటి స్పందన వ్యక్తం కాలేదు. అందుకే ప్రధాని కర్ణాటకలో తన షెడ్యూల్ ను పొడిగించుకున్నారు. మోడీతోనైనా కొన్ని ఓట్లు రాలుతాయని అనుకున్నా..బీజేపీకి అందిన నివేదికల ప్రకారం అంత సీన్ లేదని స్పష్టమైంది.

Advertisement

దీంతో బీజేపీ ప్లాన్ మార్చింది. మోడీకి విపరీతమైన ఆదరణ వస్తోందంటూ.. ఇదే గెలుపు సంకేతమని ప్రచారం ప్రారంభించింది. సోషల్ మీడియాలో మొత్తం మోడీని నింపేస్తున్నారు. మోడీ ప్రచారంతో కర్ణాటక సీన్ మారిపోయిందని.. గత కొద్దిరోజులకు ఇప్పటికి పరిస్థితుల్లో పూర్తిస్థాయి మార్పు వచ్చిందని.. గతంలో సర్వేలు చేసిన సంస్థలు ఇప్పుడు సర్వేలు చేస్తే రిజల్ట్ మారుతుందని రివర్స్ లో నరుక్కొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఓ రకంగా ఓటమిని తప్పించుకునేందుకు ప్రజలను మభ్యపెట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు సోషల్ మీడియాను విరివిగా వాడుతోంది.

కానీ బీజేపీ పార్టీ దారుణమైన పరిపాలనను.. ఇలా మోడీ చేసే ఒకటి రెండు షోలతో అంతా మర్చిపోతారని అనుకోవడం అమాయకత్వమేనని ఎన్నికల పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. కావాలనే మీడియా హైప్ క్రియేట్ చేసుకుని పరువు కాపాడుకుందామనుకుంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

Advertisement