హరీష్ రావుకు షాక్ – బీజేపీలోకి పద్మ దేవేందర్ రెడ్డి..?

మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని పొమ్మనలేక పోగబెడుతున్నారా..? అంటే ఇటీవలి పరిణామాలు అవుననే విధంగా ఉన్నాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక డిప్యుటీ స్పీకర్ గా పని చేసిన హరీష్ వర్గం నేత పద్మా దేవేందర్ రెడ్డిని రెండో దఫా కేసీఆర్ క్యాబినెట్ లోకి తీసుకోకపోగా, ఆమెను క్రమ, క్రమంగా పార్టీకి దూరం పెడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెదక్ నుంచి మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్ రావు అక్కడ యాక్టివ్ గా పాలిటిక్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.

Advertisement

మెదక్ నియోజకవర్గంలో రోహిత్ ఎన్జీవో పేరుతో విస్తృతంగా పర్యటిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. పద్మ దేవేందర్ రెడ్డి మెదక్ నియోజకవర్గంలో మరోసారి గెలిచే అవకాశం ఉనప్పటికీ మరో బీఆర్ఎస్ నేత అక్కడ యాక్టివ్ పాలిటిక్స్ చేయడం.. అధిష్టానంతో సహా జిల్లా నేతలు రోహిత్ రావును వారించకపోవడం చర్చనీయంశంగా మారింది. రోహిత్ కి టికెట్ ఇచ్చే విషయంలో హైకమాండ్ నుంచి ఏదైనా స్పష్టమైన హామీ లభించిందా..? అన్న అనుమానాలు చెలరేగుతున్నాయి.

Advertisement

వచ్చే ఎన్నికల్లో రోహిత్ కు బీఆర్ఎస్ టికెట్ ఖాయమైందని మైనంపల్లి వర్గీయులు పెద్దఎత్తున ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ , కేటీఆర్ లతో మైనంపల్లి హన్మంతరావుకున్న సన్నిహిత సంబంధాలతో టికెట్ విషయంలో గట్టిముట్టి లభించిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాలను పద్మ దేవేందర్ వర్గం జీర్ణించుకోలేకపోతోంది. మెతుకుసీమ నుంచి గెలుపుపై పద్మ దేవేందర్ రెడ్డి ఆశభావంగా ఉన్నప్పటికీ.. అసలు టికెట్ పద్మకు రావాలి కదా..? అన్నదే ఇప్పుడు జరుగుతోన్న చర్చ.

కేసీఆర్ , హరీష్ రావుల అండదండలతో తనకే టికెట్ వస్తుందని పద్మ దేవేందర్ నమ్మకంగా ఉన్నారు. ఇదిలా ఉండగా… ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పద్మా దేవేందర్ రెడ్డి భర్త దేవేందర్ రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్న కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా కు దేవేందర్ రెడ్డి ప్రత్యేక పుష్పగుచ్చం ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. దీంతో పద్మ దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ లో టికెట్ రాదని తెలిసి బీజేపీ హైకమాండ్ తో చర్చలు జరుపుతుందన్న అభిప్రాయాలు వినిపించాయి.

ఈ ప్రచారానికి బలం చేకూర్చేలా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పద్మ దేవేందర్ రెడ్డికి మద్దతుగా మాట్లాడారు. బీఆర్ఎస్ లో ఉద్యమ కాలం నుంచి కొనసాగుతూ కీలకనేతగా ఎదిగిన పద్మ దేవేందర్ రెడ్డికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వరని ప్రశ్నించడంతో కొత్త చర్చ ప్రారంభమైంది. అయితే.. తాను బీజేపీ నేతలకు టచ్ లో ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. తాను బీఆర్ఎస్ లో కొనసాగుతానని స్పష్టం చేశారు.

Advertisement