YS Sharmila : తెలంగాణలో వైఎస్సార్టీపీ పార్టీ యాక్టివ్ అవుతోంది. ఫోకస్ పెరుగుతోంది. వచ్చే సంవత్సరం తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో వైఎస్ షర్మిల తన పార్టీని యాక్టివ్ చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 3500 కిలోమీటర్ల మేర పాదయాత్రను పూర్తి చేశారు షర్మిల. అయితే.. గత రెండు మూడు రోజుల నుంచి తెలంగాణలో వైఎస్ షర్మిల గురించే చర్చ. వైఎస్ షర్మిలను ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఒక రోజు మొత్తం హైదరాబాద్ లో కూడా హైడ్రామా నడిచింది. ఎందుకంటే.. హైదరాబాద్ వచ్చిన తర్వాత తను కేసీఆర్ అధికారిక నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు మళ్లీ తనను అడ్డుకొని ఆమెపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత తను బెయిల్ పై విడుదలయ్యారు. అయితే.. ఇన్ని రోజులు దాదాపు 3500 కిలోమీటర్ల మేర షర్మిల పాదయాత్ర చేసినా రాని మైలేజ్ కేవలం.. షర్మిలను అరెస్ట్ చేయడంతో ప్రస్తుతం తెలంగాణ మొత్తం తన గురించే మాట్లాడుకుంటున్నారు.
YS Sharmila : షర్మిలను టీఆర్ఎస్ టార్గెట్ చేయడం వల్లనే ఆమె హైలెట్ అవుతున్నారా?
నిజానికి షర్మిల పార్టీ పెట్టినప్పుడు కానీ.. పార్టీ పెట్టి తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పుడు కానీ టీఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. అసలు ఆమె పార్టీ పెడితే టీఆర్ఎస్ కు ఈక అంత కూడా నష్టం ఉండదన్నట్టుగానే టీఆర్ఎస్ నేతలు ప్రవర్తించారు. కానీ.. రాను రాను వైఎస్సార్టీపీ పార్టీని టార్గెట్ చేయాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది. కొద్ది రోజులుగా ఆమెను టీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. దాని వల్ల తెలంగాణ రాజకీయాల్లో ఆమె హైలెట్ అవడం స్టార్ట్ అయింది. ప్రతిరోజు ఏదో ఒక విధంగా తెలంగాణ రాజకీయాల్లో షర్మిల టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నారు. దీంతో ఏపీలో జనసేన పార్టీ ఎలా హైలెట్ అవుతుందో.. తెలంగాణలో షర్మిల పార్టీ అలా హైలెట్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. షర్మిల పార్టీకి కొందరు సీనియర్ నేతలు తోడైతే.. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇస్తుందందున్నారు. చూద్దాం మరి ఎన్నికల వరకు ఏం జరుగుతుందో.