తెలుగు రాష్ట్రాల నుంచి అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టి క్రికెటర్ అంబటి రాయుడు. పదహారేళ్ళ వయసులోనూ మొదటిసారి 2001లో హైదరాబాద్ క్రికెట్ సంఘం తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అడుగు పెట్టి ఎసిసి అండర్ 15 ట్రోఫీ విజేత జట్టులో సభ్యుడు అయ్యాడు. పాకిస్తాన్ పై ఫైనల్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. కేవలం 3 రంజీ మ్యాచ్ లోనే 159,210 పరుగులు సాధించారు. ఓకే మ్యాచ్లో డబుల్ సెంచరీ శతకం బాదిన అతి చిన్న వయసుడిగా రికార్డ్ సృష్టించాడు. కేవలం రెండేళ్లకే భారత్ జట్టులోకి ఆహ్వానం అందింది. సురేష్ రైనా, దినేష్ కార్తీక్, రాబిన్ లతో కలిసి అండర్ 15 ప్రపంచ కప్ లో ఆడాడు అంబటి రాయుడు.
అంబటి రాయుడు ఆట తీరుతోనే కాకుండా మైదానం వెలుపల దూకుడు ప్రవర్తనకు పాపులర్ అయిన తెలుగు క్రికెటర్. ఎలాంటి విషయంలోనైనా ముక్కుసూటిగా ఉండే స్వభావం అతడి సొంతం. తాజాగా ఐపీఎల్ 2023 సీజన్ ఫైనల్ మ్యాచ్ కు ఇంకాస్త సమయం ఉందనగా ఈ మెగా లీగ్ నుంచి రిటైర్ అవుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైన మూడో సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఎంపిక అయ్యాడు. దాదాపుగా ఏడేళ్లపాటు ప్రాతినిధ్యం వహించాడు. ముంబై టైటిల్లు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రాయుడిని కొనుగోలు చేసుకుంది.
ఇప్పటివరకు 203 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన రాయుడు 4329 పరుగులు సాధించాడు. ప్రస్తుత సీజన్లో మాత్రం గొప్పగా రాణించలేకపోయాడు. అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ ముక్కు మీద కోపం చేటు ఆన్నట్లుగా వివాదాలు రాయుడు చుట్టూ ముసురుకున్నాయి. రంజీ ట్రోఫీ సమయంలో 2005లో అర్జున్ పై దాడి వ్యవహారం చోటు చేసుకుంది. ఆ తర్వాత 2012 ఐపీఎల్ సీజన్లో ప్రత్యర్థి ఆటగాడు హర్షల్ పటేల్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో రాయుడు పై 100% ఫీజు జరిమాన పడింది. 2018లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అంపైర్లతో వాగ్వాదం చేసినందుకు బీసీసీఐ అతడి పై రెండు మ్యాచ్లు నిషేధం చేసింది.