క్రికెట్ ప్రియలకు శుభవార్త. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ లు ముగించుకున్న ఇండియన్ టీం త్వరలోనే ప్రపంచ కప్ టోర్నీలో ఆడబోతున్నారు. త్వరలోనే ఆసియా కప్ టోర్నీ జరుగుతుంది. అయితే ఈసారి ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్ ఆడడం లేదని సమాచారం. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ తిరస్కరించినట్లు సమాచారం. అదే జరిగితే ఆసియా కప్ టోర్నీలో పాకిస్తాన్ తొలగిపోవడం తప్ప మరో మార్గం లేదు. భారత్ ఆడబోతున్న మ్యాచ్ లు దుబాయిలో జరగాల్సి ఉంది. కానీ అక్కడ సెప్టెంబర్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. కాబట్టి అక్కడ ఆడడం కష్టం.
అందువల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ప్రతిపాదనకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ అంగీకారం తెలపలేదని సమాచారం. నివేదిక ప్రకారం పాకిస్తాన్ లేకుండా 2023 ఆసియా కప్ జరగనున్నట్లు తెలుస్తోంది. టోర్నమెంట్ ఆడటానికి అంగీకరించినట్లు కథనాలు వస్తున్నాయి. శ్రీలంక వేదికగా ఈ టోర్నీ జరగనున్నట్లు తెలుస్తోంది. తరువాత జరగబోయే ఆసియా క్రికెట్ కప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశంలో పాకిస్తాన్ తప్ప సభ్య దేశాలను శ్రీలంకలో ఆసియా కప్ ఆడేందుకు అంగీకరించినట్లు తెలుస్తుంది.

ఒకవేళ పాకిస్తాన్ ఈ టోర్నీ నుంచి తప్పుకుంటే ఐసీసీ వరల్డ్ కప్ 2023 నుంచి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. దీని వలన పాకిస్తాన్ కు నష్టమే కలుగుతుంది. ఇకపోతే భారత్ – పాక్ మ్యాచ్లకు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. మరోవైపు పాకిస్తాన్ ఆసియా కప్ లో ఆడకుంటే అదే సమయంలో సౌత్ ఆఫ్రికా జింబాబ్వే తో కలిసి ట్రై సిరీస్ నిర్వహించాలని చూస్తోంది. ఇప్పటికే ఇరుదేశాలతో చర్చలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ మ్యాచ్ లలో ఇండియా, పాకిస్తాన్ ల మధ్య జరిగే పోరు చూడడానికి అందరికీ ఇంట్రెస్ట్ గా ఉంటుంది. కానీ ఈసారి పాకిస్తాన్ ఆసియా కప్ టోర్నీలో భాగం అవుతుందో లేదో చూడాలి.