Sridhar Vembu : కోటీశ్వరులుగా బ్రతకడం కూడా అంతా తేలికైన విషయం కాదు. ఎందుకంటే కోటి రూపాయలు సంపాదిస్తే ఇంకో కోటి ఎలా సంపాదించాలని ఆశ. అదే రెండు కోట్లు సంపాదిస్తే 20 కోట్లు రాలేదన్న బాధ. ఇక 20 కోట్లు కూడా వచ్చాయి అనుకోండి అసలు కథ అప్పుడు మొదలవుతుంది. అంతకంటే ఎక్కువ ఎలా సంపాదించాలి..? ఇది మనిషి యొక్క బలహీనత. ఎందుకంటే మనిషి ఆశకు హద్దంటూ ఉండదు. ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే డబ్బుకు దాసోహం అనాల్సిందే. ఎందుకంటే నేటి సమాజం ఉన్న తీరు అలాంటిది కాబట్టి. డబ్బు లేనిదే ఏ పని నడవదు. అందుకే రోజుకు రెండు ముద్దులు తిన్న సరే కోట్లాది రూపాయలు సంపాదించాలన్న ఆశ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఇక దీనిని చాలామంది దురాశగా పిలుస్తుంటారు. అయితే కొందరు మాత్రం ఇలాంటి విషయాలలో చాలా ప్రత్యేకంగా ఉంటారు.అలాంటిదే ఇప్పుడు ఒక ఘటన గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఒకటి కాదు రెండు కాదు కొన్ని వేలకోట్ల ఆస్తులను వదులుకొని శేష జీవితాన్ని గడుపుతున్న శ్రీధర్ వెంబు అనే వ్యక్తి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం.
అయితే శ్రీధర్ వెంబు వయసు ప్రస్తుతం 55 సంవత్సరాలు. సంపాదించిన ఆస్తిని అనుభవించే సమయం ఇంకా చాలానే ఉంది. కానీ కరెన్సీ నోటుపై విరక్తి పుట్టిన శ్రీధర్ ఎవరు ఊహించని పని చేశారు. ఐఐటి మద్రాస్ లో చదువుకున్న శ్రీధర్ అమెరికా వెళ్లి లెక్కలేనంత డబ్బును సంపాదించాడు. అలాగే సిలికాన్ వ్యాలీలో జోహో కార్పొరేషన్ స్థాపించి కొన్ని వేల కోట్లని సంపాదించాడు. అయితే ఎంత సంపాదించినప్పటికీ తన జీవితంలో ఏదో వెళితి. నిద్రలో కూడా అదే కలత ఉండేదట. ఏదో చేయాలి ఏదో చేయాలి అనుకునే సమయంలోనే అతనికో మెరుపులాంటి ఆలోచన తట్టింది. ఈ క్రమంలోనే అమెరికాను వదిలేసి తన పుట్టిన ఊరు అయినా తమిళనాడులోని మథాలంపరై కి తిరిగి వచ్చేసాడు. ఇక తాను పుట్టిన తన సొంత గ్రామంలోనే సామాన్య జీవితాన్ని గడపాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఎన్ని కోట్లు సంపాదించిన రాణి సంతోషం లుంగి సాధారణ చోక్క ధరించి సైకిల్ పై తిరగడంతో ఆయనకు లభించిందట. ఇక తన పల్లెటూరి వాతావరణం లో సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని ఆయన అనుకున్నాడు.
అలా తన సొంత గ్రామంలో ఉంటూ చిన్నపిల్లలకు పేద పిల్లలకు చదువు చెప్పటం ప్రారంభించాడు. అలా ఆయన పేదలను చదివించాలని వినూత్నంగా ఆలోచించి ప్రారంభించిన పాఠశాలలో ఇప్పుడు దాదాపు 25 మంది విద్యార్థులు చదువుతున్నారంటే గొప్ప విషయం అని చెప్పాలి.ఈ క్రమంలోనే నలుగురు ఉపాధ్యాయులను నియమించి పిల్లలందరికీ ఉచిత విద్య , ఆహారం అందించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే శ్రీధర్ కు కొత్తగా ఎడ్యుకేషన్ స్టార్ట్ అప్ ప్రారంభించాలనే ఆలోచన కూడా వచ్చింది. మరికొన్ని నెలలో ఈ స్టార్ట్ అప్ ద్వారా దాదాపు 8 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఆయన అడుగులు వేస్తున్నారు. అలాగే ఉచితంగా వైద్యాన్ని కూడా అందించే దిశగా అత్యాధునిక వసతులతో హాస్పిటల్స్ నిర్మించాలని శ్రీధర్ లక్ష్యంగా పెట్టుకున్నారట. తాను పుట్టిన ఊరికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో శ్రీదర్ వెంబు ఈ పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈయన గురించి వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. దీంతో నిజమైన శ్రీమంతుడు ఇతనే అంటూ నేటిజనులు కామెంట్స్ చేస్తున్నారు. శ్రీమంతుడు సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేసినట్లుగా శ్రీధర్ వేంబ్ తన గ్రామానికి అన్ని సౌకర్యాలను సమకూరుస్తూ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.