WhatsApp : వారెవ్వా.. వాట్సప్ లో కొత్త ఫీచర్.. దీని కోసమే కదా ఇన్ని రోజులు వెయిట్ చేసింది.. ఏంటో తెలుసా?

WhatsApp : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తాజాగా సరికొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. సాధారణంగా వాట్సప్ ను రెండు మూడు డివైజ్ లలో వాడాలనుకుంటే దాని కోసం వాట్సప్ వెబ్ అనే ఆప్షన్ ను ఉపయోగిస్తాం. మల్టీ డివైజ్ ఫీచర్ తో నాలుగు డివైజ్ లలో సేమ్ వాట్సప్ ను కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ.. వాట్సప్ వేర్వేరు ఫోన్లలో ఉపయోగించాలంటే ఎలా? దాని కోసమే.. వాట్సప్ సరికొత్త ఫీచర్ ను తన యూజర్ల కోసం తీసుకురానుంది.

whatsapp new feature to login in two smartphones with one number
whatsapp new feature to login in two smartphones with one number

ఒకే ఫోన్ నెంబర్ తో వేరే ఫోన్లలో వాట్సప్ ను వాడుకునేందుకు కొత్త ఫీచర్ ను యూజర్ల కోసం వాట్సప్ తీసుకొస్తోంది. నిజానికి మల్టీ డివైజ్ ఫీచర్ అనేది మొబైల్ నుంచి ఇతర సిస్టమ్స్, లాప్ టాప్స్, ట్యాబ్ లకు మాత్రమే వర్తిస్తుంది. కానీ.. ఒకటి కంటే ఎక్కువ మొబైల్స్ లో వాడాలంటే మాత్రం ఫోన్ నెంబర్ మార్చాల్సి ఉంటుంది. కానీ.. ఒకే నెంబర్ తో రెండు మూడు మొబైల్స్ లో వాట్సప్ ను ఉపయోగించుకోవడం కోసం యూజర్లు చాలా రోజులను వాట్సప్ ను డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఆ ఫీచర్ పై వర్క్ చేస్తున్నట్టు వాట్సప్ వెల్లడించింది. వాట్సప్ ఆండ్రాయిడ్ బీటా 2.22.15.13 వర్షన్ లో ఈ ఫీచర్ ను విడుదల చేసి టెస్ట్ చేస్తున్నారు. ఆండ్రాయిడ్ బీటా వర్షన్ ను ఉపయోగించే యూజర్లు ఈ ఫీచర్ ను చెక్ చేసుకోవచ్చు.

WhatsApp : ఎప్పటికప్పుడు సింక్ కానున్న చాట్, మీడియా ఫైల్స్

ఒకే నెంబర్ తో రెండు మొబైల్స్ లో వాట్సప్ ను ఈ ఫీచర్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. ప్రైమరీ డివైజ్ తో పాటు సెకండరీ డివైజ్ లో కూడా వాట్సప్ ను యాక్టివ్ లో ఉంచుకోవచ్చు. అలాగే ఒక మొబైల్ లో చేసిన చాటింగ్, మీడియా అన్నీ వెంటనే సెకండరీ డివైజ్ లో కూడా సింక్ అవుతాయి.

ఇప్పటికే వాట్సప్ చాలా ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మల్టీ డివైజ్, 2 జీబీ ఫైల్ షేరింగ్, వాయిస్ మెసేజ్ ఎడిట్, ఎమోజీ రియాక్షన్స్, గూగుల్ డ్రైవ్ బ్యాకప్, ఎమోజీ రియాక్షన్స్ వంటి ఫీచర్లను తీసుకొచ్చింది. ఇంకా మరిన్ని ఫీచర్ల కోసం వాట్సప్ ప్రస్తుతం వర్కవుట్ చేస్తోంది.