Sri Reddy : శ్రీ రెడ్డి ఒకప్పుడు కాంట్రవర్సీల ద్వారా ఫేమస్ అయ్యి ప్రతి ఒక్కరికి నోటెడ్ అయింది. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం ద్వారా ఫిలిం ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న దారుణాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ తెలుగు తమిళ్ ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది శ్రీ రెడ్డి. తెలుగులో సినిమాలలో అవకాశం రాకపోవడంతో కొత్తగా యూట్యూబ్ ద్వారా ఛానల్ స్టార్ట్ చేసి విలేజ్ స్టైల్ లో వంటలు చేస్తూ ప్రేక్షకులను తెగ అలరించేస్తుంది ఈ అమ్మడు. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్షంతో సమయాన్ని గడుపుతూ తన జోలికి వచ్చిన ఎంతటి వారినైనా ఉతికి ఆరేస్తుంది ఈ భామ. ఆ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఓ సంచలనాన్ని సృష్టించింది.
శ్రీ రెడ్డి తార నడుపుతున్న యూట్యూబ్ ఛానల్లో కింగ్ చేప జనకూరను వండిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో శ్రీరెడ్డి తన అందాలను ఆరబోస్తూ వంట చేయడం జరిగింది. ఈ వంట చేస్తూ అనేక విషయాలను వెల్లడించింది. ఈసారి తల్లిదండ్రులు పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించాలని చెబుతూ ఎలా ఉండాలో తనదైన స్టైల్ లో వివరించింది. అదేవిధంగా తల్లిదండ్రులు గొడవ పడుతూ ఉండడంతో ఆ ప్రభావం పిల్లల మీద ఏ విధంగా చూపుతుందో వివరించి ఈసారి కొత్తగా కనిపించింది ఈ అమ్మడు. ఉదాహరణగా చెబుతూ ఓ అబ్బాయి తన తల్లిదండ్రుల ప్రవర్తన కారణంగా ఏ విధంగా సూసైడ్ చేసుకున్నాడు వివరించి ఓ విధంగా ఎమోషనల్ గా టచ్ చేసింది.
Sri Reddy : బాగా వడ్డిచేస్తుందిగా…
వంట చేస్తూ శ్రీరెడ్డి మొదట్లో కొన్ని మసాలా పదాలు వాడటం జరిగింది. తాను వంట చేసి చాప జనం ముక్కలను చూపిస్తూ ఇది నా పప్ప ఇది మా ఫ్రెండ్ పప్పా అని డబల్ మీనింగ్ డైలాగ్స్ తో మాట్లాడుతూ ప్రేక్షకులు ను అలరించింది. తను వంట చేసే సమయంలో తన అందాల ఆరబోతతో తన అభిమానులకు అందాల మధ్య నదును కూడా పంచింది. ఇంకా అమ్మాయిలు ట్రెడిషనల్ గా ఉంటేనే అబ్బాయిలకు ఇష్టమని అలాంటి వారిని అబ్బాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారని చెప్పుకొచ్చింది. మోడరన్ గా ఉండే అమ్మాయిలను అబ్బాయిలు ఎక్కువగా ఇష్టపడరని సాంప్రదాయంగా ఉండే అమ్మాయిల మీదనే ఎప్పుడూ అబ్బాయిలు ఇంట్రెస్ట్ చూపిస్తారని కొత్తగా వివరించింది. తల్లిదండ్రులు మన మంచి ఎప్పుడూ కోరుకుంటారని వారి మాటే మనం వినాలని చెప్పుకొచ్చింది. ఏమిటో శ్రీరెడ్డి ఈసారి కొత్తగా మాట్లాడుతూ తనలో మరో విలక్షణ కోణాన్ని చూపించడం జరిగింది.