Viral Video : ఈ ఏనుగు ఏంటి ఇలా రెచ్చిపోయింది.. కారును తుక్కుతుక్కు చేసింది.. కారులోని వాళ్ల పరిస్థితి ఏంటి?

Viral Video : ఏనుగు గురించి తెలుసు కదా. అది ప్రశాంతంగా ఉన్నంత వరకే.. దానికి కోపం వచ్చిందంటే ఇక అంతే. ఎందుకంటే.. ప్రపంచంలో ఉన్న అన్ని జంతువుల కంటే కూడా అది చాలా బలమైనది. ఎక్కువ బరువు కూడా దానిదే. అందుకే.. దాని జోలికి ఎవ్వరూ వెళ్లరు. ఏనుగుకు కోపం వచ్చిందంటే ఇక మామూలుగా ఉండదు. దానికి ఆగ్రహం వస్తే తట్టుకోవడం చాలా కష్టం. దానికి ఆగ్రహం వస్తే దాన్ని విశ్వరూపం చూడాల్సిందే.

elephant goofing with car in assam video goes viral
elephant goofing with car in assam video goes viral

అలా ఏనుగులకు కోపం వచ్చి అవి రెచ్చిపోయి మనుషులను ఇబ్బంది పెట్టిన ఘటనలు ఎన్నో చూశాం. ఇళ్లను కూడా అవి కూల్చేస్తాయి. వాటికి ఏది అడ్డు వస్తే అది.. చివరకు ఇళ్లను కూడా కూల్చేస్తాయి. వాహనాలను నాశనం చేస్తాయి. తుక్కు తుక్కు చేస్తాయి.

Viral Video : హ్యుందాయ్ సాంట్రో కారుపై దాడి చేసిన ఏనుగు

తాజాగా సుశాంత నంద అనే ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ట్వట్టర్ లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. హ్యుందాయ్ సాంట్రో కారు ఒక చోట పార్కింగ్ చేసి ఉంది. అందులో మనుషులు కూడా ఉన్నారు. అస్సాంలోని గువాహతిలో ఉన్న నారెంగి మిలిటరీ స్టేషన్ లో ఈ వీడియోను రికార్డు చేశారు. ఓ కారు ముందు నిలబడి ఉన్న ఏనుగు ఆ కారుపై అటాక్ చేసింది. తన తొండంతో ఆ కారును నెట్టేసింది. లోపల ఉన్న మనుషులు అయితే అరవడం ప్రారంభించారు. ఆ కారుతో ఓ ఆట ఆడుకుంది ఏనుగు. కారును తుక్కు తుక్కు చేసింది. పక్కనే ఉన్న వాళ్లు దాన్ని అక్కడి నుంచి వెళ్లిపోయేలా చేసేందుకు రాళ్లు విసిరేసి అరిచినా కూడా ఆ ఏనుగు అస్సలు వినలేదు. ఇంకా ఆ కారును అటూ ఇటూ లాక్కెళ్లింది. ఒక కారు బొమ్మను ఆడుకున్నట్టుగా ఆడుకుంది ఏనుగు. ఆ వీడియోను చూసిన నెటిజన్లు మాత్రం వామ్మో ఇదేంది కారుతో ఇలా ఆడుకుంది అని కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఏనుగులు కార్లపై దాడి చేసిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.