Rashmika Mandanna : డీప్ ఫేక్ వీడియో పై స్పందించిన రష్మిక…కఠిన చర్యలు తీసుకోవాలంటూ…

Rashmika Mandanna  : ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అనేది విపరీతంగా పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ టెక్నాలజీ పెరిగినందుకు ఆనందపడాలో లేక దుర్వినియోగం అవుతున్నందుకు బాధపడాలో అర్థం కాని సందిగ్ధ స్థితిలో ఉంది నేటి సమాజం..అయితే టెక్నాలజీలో భాగంగానే ఈమధ్య ఏఐ టెక్నాలజీ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ ఏఐ టెక్నాలజీ తో ఏ మనిషి రూపు రేకులైన ఇట్టే మార్చేయవచ్చు. అయితే ఒకప్పుడు మార్పింగ్ వీడియోలు అంటూ గుర్తు తెలియని వ్యక్తులు ప్రముఖ సెలబ్రిటీల ఫేస్ లను అతికించి సోషల్ మీడియాలో షేర్ చేసేవారు. ఇక ఇప్పుడు అదే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి కొందరు శునకానందం పొందుతున్నారు. అయితే తాజాగా స్టార్ హీరోయిన్ రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

Advertisement

rashmika-reacts-to-the-deep-fake-video-strict-action-should-be-taken

Advertisement

బ్లాక్ టు బ్లాక్ డ్రెస్ లో ఏద అందాలను ఆరబోస్తూ లిఫ్ట్ లోకి వచ్చినట్లుగా కనిపించిన ఈ వీడియోలో రష్మిక ఉన్నట్లు అందరూ అనుకున్నారు. ఇక ఈ వీడియో చూసిన చాలామంది రష్మిక ఏంటి ఇలా మారిపోయింది అంటూ ఆశ్చర్యపోయారు. కానీ నిజానికి అది రష్మిక కాదు.ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వేరే అమ్మాయి ఫేస్ కి రష్మిక ఫేస్ ను పెట్టి రిలీజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. దీంతో ఈ వీడియో పై సినీ సెలబ్రిటీలు చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ బిగ్ బాస్ అమితాబచ్చన్ సైతం ఈ వీడియో పై స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేశాడు. అయితే తాజాగా ఈ ఫేక్ వీడియో పే రస్మిక కూడా తన ట్విట్టర్ వేదికగా స్పందించింది.

rashmika-reacts-to-the-deep-fake-video-strict-action-should-be-taken

ఆమె మాట్లాడుతూ…ఈ ఘటన గురించి మాట్లాడటం నాకు చాలా బాధగా ఉంది. ఆన్లైన్లో వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో గురించి మాట్లాడాల్సి వస్తుంది. ఇలాంటివి నాకే కాదు చాలామందిని భయానికి గురిచేస్తాయి. టెక్నాలజీని దుర్వినియోగించి ఎలాంటి పనులు చేస్తారో అని చాలామంది భయపడుతున్నారు. ఈరోజు మహిళగా ఓ నటిగా నాకు రక్షణగా మరియు మద్దతుగా నిలిచిన నా కుటుంబం స్నేహితులు మరియుు శ్రేయోభిలాషులకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కానీ ఇలాంటి ఘటన నేను స్కూల్లో లేదా కాలేజీలో ఉన్నప్పుడు జరిగి ఉంటే దీనిని నిజంగా ఎదుర్కోలెను. ఇలాంటి ఘటనలు మరి ఎప్పుడు జరగకుండా మనందరం కమ్యూనిటీగా ఉండి వీటిపై తగిన చర్యలు తీసుకోవాలి. అంటూ సైబర్ క్రైమ్ ను ట్యాగ్ చేసింది. దీంతో ప్రస్తుతం రష్మిక ట్విట్ వైరల్ గా మారింది.

Advertisement