Viral Video : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సత్యభామే సాంగ్ గురించే చర్చ. ఎవరు చూసినా సత్యభామే సాంగ్ కు ఫిదా అయిపోతున్నారు. వీడియోలు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. సత్యభామే సత్యభామే అంటూ అప్పట్లో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ నటించిన రవి బంద్ర అనే సినిమాలోని పాట అది. ఆ సినిమాలో రాజ్ కుమార్, సుమలత హీరోహీరోయిన్లుగా నటించారు. అప్పట్లో ఆ పాట సూపర్ డూపర్ హిట్ అయింది.

ఇప్పుడు ఆ పాటను రీమిక్స్ చేశారు. ఆ పాట లిరిక్స్ తో రీమిక్స్ చేయడంతో ఆ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలామంది యువతులు ఆ పాటకు డ్యాన్సులు చేస్తున్నారు. వీడియోలు చేసి మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
Viral Video : హాఫ్ శారీలో అదరగొట్టేసిన యువతి
హాఫ్ శారీతో సత్యభామే అంటూ యువతి చేసిన ఎక్స్ ప్రెషన్స్ అదిరిపోయాయి. ఆ యువతికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఆ యువతి ఎక్స్ ప్రెషన్స్ మామూలుగా లేవురా బాబోయ్.. ఏంది ఇలా హాఫ్ శారీలో ఇంత అందంగా ఉన్నావు. నీ చూపులు మామూలుగా లేవు కదా. చంపేస్తున్నావు. మరీ ఇంత అందంగా ఉన్నావు ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఆ వీడియోను వైరల్ చేస్తున్నారు.