Viral Video : వామ్మో.. క్లాస్ రూమ్ లో చదువు పక్కనపెట్టి ఈ విద్యార్థినులు ఏం చేస్తున్నారో చూస్తే నోరెళ్లబెడతారు

Viral Video : ఈ జనరేషనే వేరు బాస్. ఒకప్పటి జనరేషన్ వేరు.. ఈ జనరేషన్ వేరు. ఈ జనరేషన్ పిల్లలకు ఏం చెప్పలేం. పెరుగుతున్న సాంకేతికతను అందిపుచ్చుకొని టెక్నాలజీతో పాటు ఈ జనరేషన్ కూడా అప్ గ్రేడ్ అవుతోంది. అయితే.. ఈ జనరేషన్ వాళ్లు టెక్నాలజీకి అడిక్ట్ అయిపోతున్నారు. సోషల్ మీడియాకు బానిసలవుతున్నారు. దీంతో చిన్నప్పటి నుంచే సోషల్ మీడియా పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది.

school girls fighting in class room video viral school girls fighting in class room video viral
school girls fighting in class room video viral

సోషల్ మీడియా ద్వారా ఎంత మంచి ఉందో.. అంత చెడు ఉంది. సోషల్ మీడియాను ఉపయోగించి ఎన్ని మంచి పనులు చేయొచ్చు.. దాన్ని దుర్వినియోగం చేస్తే మనకు అది అంత నష్టాన్ని చేకూర్చుతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను చూస్తే మీరే ఒప్పుకుంటారు.

Viral Video : జుట్లు పట్టుకొని మరీ కొట్టుకున్న విద్యార్థినులు

ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఓ ప్రైవేట్ స్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్లాస్ రూమ్ లోనే యూనిఫాంలో ఉన్న విద్యార్థినులు ముగ్గురు తమ జుట్లు పట్టకొని మరీ కొట్టుకున్నారు. ఒకరి జుట్టు మరొకరు పట్టుకొని అస్సలు వదలకుండా తన్నుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వామ్మో.. క్లాస్ రూమ్ లో చదువుకోవాల్సిన విద్యార్థినులు ఇలా జుట్లు పట్టుకొని కొట్టుకోవడం ఏంటి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. వాళ్లంతా స్కూల్ విద్యార్థినులే.. తోటి విద్యార్థినులు వాళ్లను ఆపాలని ఎంత ట్రై చేసినా ఆ ముగ్గురు మాత్రం అస్సలు ఆగకుండా కొట్టుకుంటూనే ఉన్నారు. క్లాస్ రూమ్ లో చదువుకోకుండా విద్యార్థినీ విద్యార్థులు రొమాన్స్ చేసుకున్న వీడియోలను చూశాం.. క్లాస్ రూమ్ లో టైమ్ చేసే విద్యార్థుల వీడియోలు చూశాం కానీ.. ఇలా జుట్లు పట్టుకొని కొట్టుకునే విద్యార్థినుల వీడియోలను మాత్రం ఇప్పుడే చూస్తున్నాం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ విద్యార్థినుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమయింది.