Viral Video : ప్రతిరోజు ప్రపంచంలో ఏదో ఒకచోట ఏదో ఒక ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అలా జరిగిన ఘటనలు మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి సీసీ కెమెరాలు ద్వారా రికార్డు అవుతూ ఉంటాయి. అలా రికార్డ్ అయిన వీడియోలు కొన్ని ఆశ్చర్యపరిచే విధానం కొన్ని భయభ్రాంతులకు గురి చేసే విధానం కొన్ని నవ్వుకునెలా ఉంటాయి… అయితే ప్రస్తుతం మనం చూడబోయే వీడియోలో 10 సంవత్సరాల కుర్రాడు యొక్క తన తల్లి మీద ఉన్న ప్రేమతో అతను చేసిన ధైర్యవంతమైన పనికి తన తల్లిని ప్రాణహాని లేకుండా కాపాడుకోగలిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Viral Video : స్విమ్మింగ్ పూల్ లో మూర్ఛలు వచ్చిన తల్లిని కాపాడిన పదేళ్ల కుర్రాడు….
విషయానికొస్తే వీడియోలో మొదటగా తల్లి నటే లోరి అనే మహిళ స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ ఉంటుంది. అలా ఈత కొడుతున్న సమయంలో ఆమెకి మూర్చలు వస్తాయి. అది గమనించిన ఆ మహిళ యొక్క 10 సంవత్సరాల కొడుకు గవిన్ అనే కుర్రాడు భయపడకుండా ధైర్యంతో ఆ స్విమ్మింగ్ పూల్ లో దూకి తన తల్లిని నీటిలో మునిగిపోకుండా దాదాపు పది నిమిషాల వరకు నీటిపై తేలేలా పైకి పట్టుకొని ఉంటాడు. అలా చేయడం వలన తన తల్లి నీటిలో మునిగిపోకుండా ఉంటుంది. ఇంతలో పిల్లాడి యొక్క తాత వచ్చి వారిద్దరిని క్షేమంగా బయటకు తీసుకెళ్లిన ఘటన మనం ఈ వీడియోలో చూడొచ్చు.
ఆ పది సంవత్సరాల కుర్రాడు మూర్చరు వచ్చిన తన తల్లిని కలను మధ్యలో నుంచి తీసుకువచ్చిన ధైర్యం చూస్తుంటే అందరికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ కుర్రాడు యొక్క ధైర్యసహసాలకు ఆ తల్లిని కాపాడుకున్న తీరును చూసిన నటిజెన్లు సోషల్ మీడియాలో ఆ కుర్రాడిని పొగుడుతూ అనేక రకాలుగా కామెంట్ చేస్తున్నారు. లక్షల్లో యూస్ వస్తూ ఈ వీడియో వైరల్ గా మారింది. మీరు కూడా ఆ కుర్రాడి ధైర్యాన్ని చూడండి.