Viral Video : ఈ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. రేపు అనేది ఉంటుందా అంటే చెప్పలేం. అందుకే ఈ క్షణాన్ని సంతోషంగా గడపాలి. అదే మనం చేయాల్సింది. ఇంట్లో నుంచి బయట అడుగు పెడితే ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. తిరిగి ఇంటికి వచ్చేదాకా గ్యారెంటీ లేదు. చావు ఏ రూపంలోనైనా రావచ్చు. అందుకే ప్రతి క్షణం అలర్ట్ గా, జాగ్రత్తగా ఉండాలని చెబుతుంటారు పెద్దలు.

తాజాగా అటువంటి ఘటనే ఒకటి తాజాగా చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో పని ఉండి ఓ షాపు లోపలికి వెళ్లబోతూ ఫుట్ పాత్ ఎక్కాడు. అంతే.. ఒక అడుగు ముందుకు వేశాడో లేదో వెనుక ఉన్న డ్రైనేజీ కాలువ కూలిపోయింది. ఒక్క అడుగు అతడిది వెనుకే ఉన్నా ఆ కాలువలో పడిపోయేవాడు. ఆ కాలువ కూడా చాలా లోతు ఉంది. అందులో పడితే ఖచ్చితంగా పెను ప్రమాదం జరిగి ఉండేది.
Viral Video : కూలిపోయిన డ్రైనేజీని చూసి షాక్ అయిన ఆ వ్యక్తి
తను నడుస్తుండగానే ఆ డ్రైనేజీ కాలువ కూలిపోవడంతో ఆ వ్యక్తి షాక్ అయ్యాడు. పెను ప్రమాదం నుంచి తప్పించుకోవడంతో అతడు ఊపిరి పీల్చుకున్నప్పటికీ రోడ్ల మీద నడుస్తున్నా కూడా మనుషులకు రక్షణ లేకుండా పోయిందే అని ఆ వీడియో తెలియజేస్తోంది.
I’m going to spend the weekend trying to figure out what message the Universe was sending this man. What would you be thinking if you were him? pic.twitter.com/U55PDCZPry
— anand mahindra (@anandmahindra) August 5, 2022
ఈ వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. అసలు ఈ అనంత విశ్వం ఆ వ్యక్తికి ఏం చెప్పాలనుకుంటోంది. అసలు దీని గురించి ఆలోచించడానికే ఈ వీకెండ్ ను కేటాయించాను. ఒకవేళ అతడి స్థానంలో మీరు ఉంటే ఏం చేసేవారు అంటూ ఆనంద్ ఆ వీడియోను ట్వీట్ చేశారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.