Viral Video : ఈరోజుల్లో ఎవ్వరూ తక్కువ కాదు. ఎవ్వరూ ఎక్కువ కాదు. ఎవరి టాలెంట్ వారిది. అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా ఎవరైనా సరే.. తమకు టాలెంట్ ఉంటే ఎక్కడికో వెళ్లిపోతారు. అందుకే టాలెంట్ ఎవరి సొత్తు కాదు అంటారు. తాజాగా ఈ వీడియో చూస్తే అదే అంటారు. అమ్మాయిలు కూడా ఎంతో ధైర్యంతో ముందుకు సాగుతారని.. వీరనారి ఝాన్సీ రాణి, రుద్రమదేవి లాంటి ఎందరో వీరవనితలు నిరూపించారు. ఈరోజుల్లో మగాళ్లకు దీటుగా ఆడవాళ్లు కూడా పనులు చేస్తున్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్నారు.
తాజాగా ఓ యువతి చేసిన కర్రసాము వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చాలామంది కర్రసామును ఎందుకు నేర్చుకుంటారో తెలుసు కదా. ఆత్మరక్షణ కోసం కొందరు నేర్చుకుంటారు. ఈ యువతి ఎందుకు కర్రసాము నేర్చుకుందో కానీ.. తను కర్రసాము మాత్రం సూపర్ గా చేసింది.
Viral Video : ఎంత అవలీలగా కర్రను తిప్పేసింది
కర్రసాము చేయడం మగవాళ్లకే చేతగాదు. కర్రసాము చేయాలంటే ఎంతో సాధన చేయాలి. కఠోర శ్రమ చేయాలి. మరి ఈ యువతి ఎంత కఠోర శ్రమ చేసిందో తెలియదు కానీ.. ఆ యువతి కర్రసాము వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియో చూసి ఫిదా అవుతున్నారు.
ఆ యువతి చేసిన కర్రసాము వీడియోను ఆశ్చర్యంగా అక్కడున్న స్థానికులు చూశారు. ఆ యువతి కర్రసామును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వావ్.. ఒక అమ్మాయి అయి ఉంది.. ఈ యువతి ఎంత బాగా కర్రసాము చేస్తోంది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.