Kajal Agarwal : ఓ మై గాడ్…సామ్ లాగే కాజల్ కూడా అరుదైన జబ్బుతో బాధపడుతుందా…?

Kajal Agarwal : రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోయిన్ అందరూ ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యం బారిన పడుతున్నారు. అది కూడా అతి భయంకరమైన రేర్ డిసీస్ కు గురవుతుండడం అభిమానులను నిరాశపరిచేలా చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల స్టార్ హీరోయిన్ సమంత మయోటైసిస్ అనే ఓ భయంకరమైన వ్యాధికి గురైన సంగతి తెలిసిందే. ఈ వ్యాధి కారణంగా సమంత కూడా కొన్నాళ్ళ పాటు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉండి తన ఆరోగ్యం పై దృష్టి పెట్టింది. ఇక ఇప్పుడు కోలుకోని సినిమాలుు చేస్తున్నప్పటికీ ఈ వ్యాధి కారణంగా ఇప్పటికీ సమంత బాధపడుతూనే ఉంది.

oh-my-god-is-kajal-suffering-from-a-rare-disease-like-sam

అయితే ఇదే విధంగా మరి కొందరు హీరోయిన్స్ కూడా పలు రకాల వ్యాధులకు గురైనట్లు చెప్పుకొచ్చారు. అయితే తాజాగా అదే లిస్టులోకి యాడ్ అయింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. అయితే పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన కాజల్ ఇటీవల బాలకృష్ణ హీరోగా నటిస్తున్న భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె ఓ మీడియా ఛానల్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగా ఆమె మాట్లాడుతూ తనకి ఓ వింత జబ్బు ఉన్నట్లుగా తెలియజేసింది.

oh-my-god-is-kajal-suffering-from-a-rare-disease-like-sam

ఎంత డైట్ చేసినా ఎంత వర్కౌట్స్ చేసినా తన బాడీకి ఏం కాదట ఎంత ఫుడ్ తిన్న తను లావుగా అవ్వదట. ఒకవేళ తాను ఏదైనా పనుల్లో పడిపోయి మూడు రోజులు వర్క్ చేయకపోతే మాత్రం వెంటనే బరువు పెరిగిపోతుందట. ఇక ఆ బరువు తగ్గడానికి సుమారు పది రోజులు పాటు కష్టపడాల్సి ఉంటుందని తెలియజేశారు. అందుకే ఎన్ని పనులు ఉన్నా సరే జిమ్ చేయడం మాత్రం ఆ పని ఆపను అని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ఇది కూడా ఒక విధమైన వ్యాధి అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.