Raviteja : ఇటీవల దసరా పండుగ సందర్భంగా మాస్ మహారాజ రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాను విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే రవితేజ అంతకుముందు నటించిన రావణాసుర సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ను చవిచూసింది. దీంతో ఎలాగైనా ఈసారి సినిమాతో సూపర్ డూపర్ హిట్ అందుకొని మళ్లీ తన క్రేజ్ ను కొనసాగించాలని రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. అయితే ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన టైగర్ నాగేశ్వరరావు బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఏర్పాటుచేసిన సక్సెస్ మీట్ లో పాల్గొన్న రవితేజ ఎమోషనల్ అయ్యారు.
ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ పర్సనల్ గా కానీ ప్రొఫెషనల్ గా కానీ పాజిటివ్ గా మాట్లాడేవారు పక్కన ఉంటే బాగుంటుందని తన సినిమాకు పని చేసిన వాళ్లతో అన్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించి ప్రతి ఒక్కరికి టెక్నీషియన్స్ కు అందరికీ థాంక్స్ అంటూ ,అలాగే లిరిక్ లైటర్ కు ధన్యవాదాలుు తెలియజేశారు. అదేవిధంగా సినిమాకు పని చేసిన ఫైటర్స్ డైలాగ్ రైటర్స్ కి కూడా ధన్యవాదాలు తెలియజేశారు. నా అభిమానులు ప్రేక్షకులు వెల్విసర్స్ సినిమా చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. అలాగే ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన అభిషేక అగర్వాల్ గారు ఇలాంటి మరెన్నో సినిమాలను తీయాలని కోరుకుంటున్నా. ఇక డైరెక్టర్ వంశీ చెప్పినట్లు కొత్త వాళ్ళతో చేస్తేనే సినిమా చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది.
కానీ కొత్త వారితో సినిమా చేయించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. అది చాలా తక్కువ మందికి మాత్రమే సాధ్యమవుతుంది. మా డైరెక్టర్ వంశీ ఇంతకుముందు చేసిన రెండు సినిమాలు తనకు టెస్ట్ మ్యాచ్ లాంటివి అంటూ రవితేజ చెప్పకు వచ్చారు. అంతేకాక ఈ సినిమాలో నటించిన చాలామంది ఆర్టిస్టులు కాదు. వారు క్యారెక్టర్స్ లు మాత్రమే కనిపిస్తారు. డైరెక్టర్ వంశీ నుంచి నేను ఇంత ఊహించలేదు. ఇంకా మంచి సినిమాలు తీయాలి నీకు అంత కెపాసిటీ ఉంది. అంటూ రవితేజ డైరెక్టర్ ను విపరీతంగా మెచ్చుకున్నాడు. అంతేకాక విక్రమ్ సింగ్ రాథోడ్ క్యారెక్టర్ తర్వాత నాకు నచ్చిన క్యారెక్టర్ టైగర్ నాగేశ్వరరావు అంటూ రవితేజ చెప్పుకొచ్చారు.