Viral Video : కరెంట్ ఇవ్వలేదని మొసలిని తీసుకొచ్చి విద్యుత్ కార్యాలయంలో వదిలిపెట్టిన రైతులు…షాకింగ్ వీడియో..

Viral Video : ప్రస్తుతం కర్ణాటకలో కరెంటు కోరత సమస్య తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే రైతులందరూ అల్లాడిపోతున్నారు. పండించిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ కరెంటు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. కరెంటు కోతలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతులు ధర్నాలు కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఎండిపోయిన పంటలను తీసుకువచ్చి విద్యుత్ కార్యాలయాల ముందు నిరసనలు చేయడం కూడా మొదలెట్టారు. ఈ నేపథ్యంలోనే పలువురు కార్యాలయం లోపలికి వెళ్లేందుకు కూడా ప్రయత్నించినప్పటికీ పోలీసులు వారిని పట్టుకోవడం జరిగింది.

Advertisement

Advertisement

అయితే ఎంతో సౌమ్యంగా ఉండే రైతులు ఆగ్రహం కలిగితే ఎలా ఉంటుందో అన్న విషయాన్ని రామచూర్ రైతులు చూపించారు. ఈ నేపథ్యంలోనే విద్యుత్ కోతలను నిరసిస్తున్న విజయపుర్ రైతులు వినూత్నంగా వారి నిరసన వ్యక్తం చేశారు. విజయపూర్ జిల్లా కోల్హారా తాలూకా రోనిహళ్ గ్రామానికి చెందిన రైతులు వినూత్నంగా ఆలోచించి ఓ ట్రాక్టర్ పై ముసలిని తీసుకొచ్చి హై స్కామ్ సబ్ స్టేషన్ యూనిట్ ఆవరణలో వదిలిపెట్టారు. ఇక ఈ ముసలి తోకకు ఒక తాడును మరియు మెడకు ఒక తాడు తగిలించి కాసేపు విద్యుత్ సబ్ స్టేషన్ ఆవరణలో తిప్పుతూ నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతానికి చెందిన రైతులు మాట్లాడుతూ…రాత్రి సమయాలలో కరెంట్ చాలా ఆలస్యంగా ఇస్తున్నారని…

చీకట్లో పొలాలకు వెళ్లడం వలన పాము కాటుకు గురయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని అలాగే విద్యుత్ షాక్ లకు గురయ్యే ప్రమాదాలు కూడా ఉన్నాయంటూ వాపోయారు. కరెంట్ ఇచ్చేదే తక్కువ ఇక దానిని కూడా రాత్రి సమయంలో ఇస్తే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికున్న సమస్యలను అధికారులకు తెలియజేసేందుకే ఈ మొసలి ని తీసుకొచ్చినట్లుగా వారు తెలియజేశారు. అయితే వారు రాత్రి సమయం లో పొలంలో తిరుగుతుండగా మొసలి కనిపించడంతో పట్టుకుని ట్రాక్టర్ లో వేసుకుని సబ్ స్టేషన్ కు తీసుకొచ్చినట్లు వారు తెలియజేశారు. చివరికి అటవీశాఖ అధికారులు రైతులను బుజ్జగించి మొసలిని తీసుకెళ్లిపోయారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

Advertisement