Viral Video : మద్యం మత్తులో ఉన్నప్పుడు చాలామంది సాధ్యం కానటువంటి పనులను కూడా చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. మరికొందరైతే మద్యం మత్తులో అసలు ఏం చేస్తున్నామో వారికి కూడా అవగాహన ఉండదు. ఈ క్రమంలోనే ఒక్కోసారి ప్రాణాంతక పనులను చేస్తుంటారు. ప్రమాదకర జంతువులతో పరిహాసాలాడుతారు. అయితే తాజాగా ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే చూస్తున్నాం. అయితే తాజాగా కేరళలో ఓ వ్యక్తి మద్యం మత్తులో కొండచిలువతో ఆటలాడాడు. దానిని మెడలో వేసుకొని సెల్ఫీ దిగాలని అనుకున్నాడు. చివరికి తన ప్రాణాల్ని పణంగా పెట్టేశాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే కేరళలోని కర్నూలు జిల్లాలో అక్టోబర్ 21న అర్ధరాత్రి పెట్రోల్ బంక్ లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఆరోజు రాత్రి బాగా మధ్యం తాగిన ఓ వ్యక్తి కొండచిలువను మెడలో వేసుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇక ఆ కొండచిలువతో అతను సెల్ఫీ దిగాలనుకున్నాడు. ఈ క్రమంలోని పక్కనే ఉన్న పెట్రోల్ బంక్ లోకి వెళ్లి అక్కడే ఉన్న సిబ్బందిని ఫోటోలు తీయమని అడిగాడు. దీంతో పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్న వ్యక్తులు వీడియో తీయ సాగారు. అయితే ఫోటోలు తీస్తున్న సమయంలో మెడలో ఉన్న కొండచిలువ ఒక్కసారిగా తన ప్రతాపం చూపించడం మొదలుపెట్టింది.
ఒక్కసారిగా ఆ వ్యక్తి యొక్క మెడను గట్టిగా బిగించింది. ఈ క్రమంలో కొండచిలువ నుండి విడిపించుకునేందుకు అతను ప్రయత్నిస్తున్నాడు. సాధ్యం కాక అక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన వ్యక్తి వెంటనే వెళ్లి కొండచిలువను తప్పించాడు. అయితే కాసేపు కొండచిలువ అలాగే అతని మేడను పట్టుకుని ఉంటే ఊపిరి అందక చనిపోయేవాడు. పక్కనే ఉన్న వ్యక్తి వెంటనే సహాయం అందించడం వలన కొండచిలువ భారీ నుంచి తప్పించుకున్నాడు. లేకుంటే ప్రాణాల్ని కోల్పోయేవాడు. దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నేటిజనులు పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram