Spinach : పాలకూర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని అధికంగా తింటుంటారు. బరువు తగ్గాలనుకునే వారు పాలకూరని తరచుగా తింటుంటారు. ఈ కూరని డైట్ లో చేర్చుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. పాలకూరలు మెగ్నీషియం ,క్యాల్షియం ,పొటాషియం, ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి పాలకూరని రోజు తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు రోజు ఏదో ఒక ఆకుకూర తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఆకుకూరల్లో ఎక్కువగా విటమిన్ సి, ఇ, బి వీటితో పాటు మెగ్నీషియన్, ఐరన్ ,జింక్ వంటి మినరల్స్ వంటివి ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. రోజు మనం తినే ఆహారంలో ఏదో ఒక ఆకుకూర తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిది. పాలకూర జ్యూస్ లో ఒక స్పూన్ తేనె కలుపుకొని ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల బరువు ఈజీగా తగ్గవచ్చు. అంతేకాకుండా క్యాన్సర్ వంటి వ్యాధులను దూరం చేస్తుంది.
Spinach : పాలకూర ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో తెలుసా?

పాలకూరలో తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది.పాలకూర ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని ఎక్కువగా తీసుకుంటుంటారు. కానీ పాలకూరని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.రోజు ఒక కప్పు పాలకూర తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదే, కానీ దానికంటే ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు తెలియజేశారు.
పాలకూరలో ఆక్సిలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది మొక్కల్లో సహజంగా కనిపించే కాంపౌండ్. మన శరీరంలో ఆక్సిలిక్ యాసిడ్ ఎక్కువైతే శరీరం ఇతర పోషకాలను లభించే శక్తిని కోల్పోతుంది. ఆకుకూరల్లో హిస్టిమేన్ ఉంటుంది. ఇది శరీరంలో కొన్ని కణాల్లో కనిపించే రసాయనం. ఇవి అలేర్జీలను సృష్టించే ప్రమాదం ఉంటుంది. పాలకూర ఎక్కువగా తీసుకుంటే శరీరం పై దుష్ప్రభావం ఏర్పడుతుంది