Health benefits : మన శరీరంలో ముఖ్యమైన గ్రంథులలో ఒకటి థైరాయిడ్. ఇది మన శారీరక ఎదుగుదలలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ గ్రంధి పనితీరు గతితప్పడం వలన హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, గాయిటర్ వంటి సమస్యలు వస్తాయి. థైరాయిడ్ హార్మోన్ సవ్యంగా విడుదలైనప్పుడే శరీరంలో జీవక్రియ పనితీరు బాగుంటుంది. థైరాయిడ్ హార్మోన్ విడుదలలో ఎప్పుడైతే సమతూల్యం లోపిస్తుందో అప్పుడు ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు చాలామందికి థైరాయిడ్ సమస్య ఎక్కువ అవుతుంది.
ఎందుకంటే జీవన విధానంలో వచ్చిన మార్పులు, చెడు ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వలన థైరాయిడ్ వస్తుంది. సాధారణంగా థైరాయిడ్ రెండు రకాలుగా ఉంటుంది.ఒకటి హైపర్ థైరాయిడిజం. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయితే ఈ సమస్య వస్తుంది. టి3,టి4 హార్మోన్లు ఎక్కువగా రిలీజ్ అయితే టీఎస్ హెచ్ తగ్గిపోతుంది. దాంతో జీవక్రియల పనితీరు వేగం పెరుగుతుంది. దీని కారణంగా గుండె దడ, బరువు తగ్గిపోవడం,
Health benefits : థైరాయిడ్ బాధితులు త్వరగా బరువు తగ్గాలంటే…

అకారణంగా చెమటలు పట్టడం, నిద్రపట్టకపోవడం, చేతులు ఒణకడం, మానసిక ఒత్తిడి, నెలసరి క్రమం తప్పడం, విరేచనాలు అవడం వంటి సమస్యలు వస్తాయి. రెండవది హైపోథైరాయిడిజం థైరాయిడ్ గ్రంధి థైరాక్సిన్ ను తక్కువగా ఉత్పత్తి చేయడం వలన ఈ సమస్య వస్తుంది. టీ3, టీ4 హార్మోన్లు తగ్గుతాయి. దీని వలన జీవక్రియ పనితీరు మందగిస్తుంది. దీని వలన బరువు పెరుగుతారు త్వరగా అలసిపోతుంటారు. థైరాయిడ్ బాధితులు బరువు తగ్గాలంటే థైరాయిడ్ సమస్యను నివారించడం ముఖ్యం. అందుకనే కొన్ని ఆహార పదార్థాలతో థైరాయిడ్ ను నియంత్రణలో ఉంచుకోవచ్చు.
ఫైబర్ థైరాయిడ్ ను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తింటే జీర్ణక్రియ మెరుగుపడి, శరీరంలోని చెడు టాక్సీన్ తొలగిపోతుంది. ఫైబర్ క్యాలరీలను తీసుకోవడం నియంత్రించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా మీరు త్వరగా బరువు తగ్గుతారు. ఫైబర్ ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, అవకాడో, బెర్రీలు, నట్స్, ఓట్స్, ఆపిల్, క్యారెట్, జామకాయ లో ఉంటుంది.
అలాగే అయోడిన్ కలిగిన ఆహార పదార్థాలను తీసుకుంటే థైరాయిడ్ పనితీరు బాగుంటుంది. హైపోథైరాయిడిజం వారు చేపలు, ఉప్పు, పాల ఉత్పత్తులు, గుడ్లు వంటి ఆహారాన్ని తీసుకోవాలి. అయోడిన్ ఎక్కువగా బ్రెజిల్ నట్స్ గుడ్లు, చిక్కుళ్ళు ఎక్కువగా ఉంటుంది. వీటిని తింటే థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. అలాగే థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు ఎక్కువగా వాటర్ త్రాగాలి. ఇలా తాగితే జీవక్రియ పనితీరు బాగుంటుంది. థైరాయిడ్ కంట్రోల్ లో ఉంటుంది.