Puspa2 : మన టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీకి దేశవ్యాప్తంగా ఎంత ఆదరణ లభించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్పరాజుగా చేసిన క్యారెక్టర్ లో ఎంతలా జీవించాడనేది ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ చూస్తే చెప్పొచ్చు. అంతలా అల్లు అర్జున్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సుకుమార్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా అంచనాలకు మించి సక్సెస్ రావడంతో దేశవ్యాప్తంగా పుష్ప ఫీవర్ కొన్ని నెలలపాటు కొనసాగిందని చెప్పవచ్చు.
పుష్ప అంత విజయం సాధించడంతో పుష్ప2 మూవీ పై ఇప్పుడు ప్రేక్షకులలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలు కావలసి ఉండగా సుకుమార్ స్క్రిప్టులో మార్పులు చేర్పుల కారణంగా కొంచెం వెనకబడినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాను ఆగస్టు నుంచి షూటింగ్ షెడ్యూల్ మొదలు కాబోతున్నట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా పుష్ప2 లో కొంతమంది స్టార్ నటీనటులు నటిస్తున్నట్టుగా అంతేకాకుండా ప్రముఖ బాలీవుడ్ నటుడు అయినటువంటి మనోజ్ భాజ్ పాయ్ ఈ సినిమాలో చేస్తున్నట్లుగా రూమర్స్ వచ్చాయి.
Puspa2 : పుష్ప2 లో ఫ్యామిలీ మెన్ యాక్టింగ్ అంటూ వచ్చిన రూమర్స్ పై క్లారిటీ…

ఫ్యామిలీ మెన్ సిరీస్ తో మంచి పాపులర్ అయినటువంటి మనోజ్ భాజ్ పాయ్ ఈ సినిమాలో కీలక ప్రాత్ర చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలపై ఆయన స్పందిస్తూ ఇలాంటి అప్డేట్స్ మీకు ఎవరు ఇస్తారు అని మీడియా సమక్షంలో ప్రశ్నించాడు. ఈ సినిమాలో తను చేయడం లేదంటూ క్లారిటీగా చెప్పేశాడు. దీంతో మనోజ్ భాజ్ పాయ్ పై వస్తున్న పుష్ప2 లో నటిస్తున్నాడన్న రూమర్స్ కు కనపడిందని చెప్పవచ్చు.
పుష్ప టు లో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మదన్న హీరోయిన్ గా కొనసాగుతుండగా పుష్పవన్ మాదిరిగానే పహాద్ ఫాసిల్ వీళ్లనుగా చేయనున్నాడు. ఈ సినిమాలో నటీనటుల ఎంపిక పై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఎవరు నటిస్తున్నారు లేదనేది తెలియాల్సి ఉంది. కాదా ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ మేకర్స్ బ్యానర్ పై ఎలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని నిర్మాణ సారధ్యంలో సుకుమార్ దర్శకత్వంలో దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో ఈ సినిమా స్టేజ్ పైకి రానుంది.