Thank You Movie Review : నాగచైతన్య ‘థాంక్యూ’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Thank You Movie Review : లవ్ స్టోరీ సూపర్ సక్సెస్ కావడంతో నాగ చైతన్య మాంచి జోరుమీదున్నాడు. లవ్ స్టోరీ తర్వాత బంగార్రాజు సినిమాలో నటించాడు. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతో నాగ చైతన్య ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆ తర్వాత తాజాగా థాంక్యూ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాను విక్రమ్ కే కుమార్ తెరకెక్కించాడు. ఇప్పటికే మనం అనే సినిమాకు విక్రమ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్ హీరోయిన్లుగా ఈ సినిమాలో నటించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, టీజర్, పోస్టర్లు, పాటలు సోషల్ మీడియాలో ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. మరి.. థాంక్యూ అంటున్న నాగచైతన్య ప్రేక్షకులను మెప్పించాడో లేదో తెలియాలంటే సినిమా కథ ఏంటో తెలుసుకోవాల్సిందే.

naga chaitanya thank you movie review and rating
naga chaitanya thank you movie review and rating

సినిమా పేరు : థాంక్యూ

నటీనటులు : నాగ చైతన్య, రాశీ ఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్, సాయి సుశాంత్ రెడ్డి, ప్రకాశ్ రాజ్

డైరెక్టర్ : విక్రమ్ కే కుమార్

నిర్మాతలు : రాజు, శిరీష్

మ్యూజిక్ డైరెక్టర్ : తమన్

సినిమాటోగ్రఫీ : పీసీ శ్రీరామ్

రిలీజ్ డేట్ : 22 జులై 2022

Thank You Movie Review : సినిమా కథ ఇదే

నారాయణపురం అనే ఓ మారుమూల పల్లెలో కథ ప్రారంభం అవుతుంది. అభిరామ్(నాగ చైతన్య) జర్నీనే ఈ సినిమా. అభి చిన్నతనం దగ్గర్నుంచి.. ఒక సక్సెస్ ఫుల్ వ్యక్తిగా ఎలా ఎదిగాడు. అతడు విజయం అందుకోవడానికి మధ్యలో ఏం జరిగింది.. అనేదే ఈ సినిమా. అసలు.. ఎవరి సాయం లేకుండానే.. తానే సొంతంగా ఓ కంపెనీని స్థాపించి బిలియనీర్ అయ్యాను అని అనుకుంటాడు అభి. కానీ.. అది తప్పు అని అసలు ఎవరి సాయం లేకుండా ఎవ్వరూ పైకి ఎదగలేరని తనకు తర్వాత తెలుస్తుంది. దీంతో అతడి విజయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలనుకుంటాడు. దాని కోసమే థాంక్యూ టూర్ మొదలుపెడతాడు. మరి.. హీరోయిన్ల పాత్ర ఏంటి? ముగ్గురు హీరోయిన్లను ఈ సినిమాకు ఎందుకు తీసుకున్నారు? చివరకు నాగ చైతన్య ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? తను బిలియనీర్ ఎలా అయ్యాడు? గొప్ప వ్యాపారవేత్తగా ఎలా ఎదిగాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ

సక్సెస్, థాంక్స్ ఈ రెండు పదాలకు ఎలాంటి సంబంధం ఉంటుందో.. ఆ రెండు ప్రతి మనిషి జీవితంలో ఎంత ముఖ్యమూ చెప్పే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. ఇది ఒక ఎమోషనల్ లవ్ డ్రామాగా ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం అదుర్స్ అని చెప్పుకోవాలి. రాశీ ఖన్నా క్యారెక్టర్ లోనూ చాలా షేడ్స్ ఉన్నాయి. ఇక.. చైతూ అయితే ఒక టీనేజ్ కుర్రాడిగా, కాలేజీ స్టూడెంట్ గా, సక్సెస్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా.. మూడు డిఫరెంట్ పాత్రల్లో మెరిసిపోయాడు. తన పాత్రకు జీవం పోశాడు. సినిమా మొత్తాన్ని చైతూ తన భుజాల మీద మోశాడు. టీనేజ్ కుర్రాడిగా ఉన్నప్పుడు ఒక లవ్ స్టోరీ, కాలేజీ స్టూడెంట్ గా ఉన్నప్పుడు మరో లవ్ స్టోరీ, సక్సెస్ ఫుల్ బిజినెస్ మెన్ అయ్యాక మరో లవ్ స్టోరీ. ఇలా మూడు దశలను కనెక్ట్ చేసి స్టోరీ రాసుకున్నాడు విక్రమ్.

కన్ క్లూజన్

థాంక్యూ అంటున్న నాగా చైతన్య స్టోరీ ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాకు కనెక్ట్ కాగలరు. ఎందుకంటే ప్రతి ఒక్కరి సక్సెస్ వెనుక చాలా మంది ఉంటారు. అందుకే.. ఈ సినిమాను ప్రతి ఒక్కరు తమ జీవితంలో అన్వయించుకోవచ్చు. ఎమోషనల్ లవ్ అండ్ సైకలాజికల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాలో రిలేషన్ షిప్, సక్సెస్, థాంక్యూ అనే వాటి చుట్టే కథ తిరుగుతూ ఉంటుంది. అందుకే.. అలాంటి జానర్ సినిమాలంటే ఇష్టం ఉన్నవాళ్లు ఈ సినిమాకు చూసేయొచ్చు.

యువతరం రేటింగ్ : 3/5