Zodiac Signs : మిధున రాశి వారికి ఆగస్టు నెలలో రాశి ఫలాలు అలాగే గ్రహ స్థితి ఏ విధంగా ఉన్నాయంటే…

Zodiac Signs : ఆగస్టు నెల 2022లో మిధున రాశి వారికి గ్రహస్థితి ఏవిధంగా ఉన్నదో ఇప్పుడు తెలుసుకుందాం.. మేషరాశిలో కుజుడు, రాహువు కలిసి ఉంటారు. 11వ తేదీ వరకు కలిసి ఉండి, 11వ తేదీ నుండి వృషభంలోకి కుజుడు చేరుకుంటాడు. అలాగే మిధునంలోని ఉన్నటువంటి శుక్రుడు ఏడవ తేదీ నుండి కర్కాటకం లోకి వస్తారు. అదేవిధంగా కర్కాటకంలోని ఉన్నటువంటి రవి 16వ తేదీ నుంచి సింహంలోకి వెళ్తాడు. సింహంలో ఉన్న బుధుడు, చంద్రులు కలిసి ఉన్నారు. ఆ యొక్క బుధుడు 21వ తేదీ వరకు సింహ రాశిలో ఉండి, తరువాత కన్య రాశిలోకి వెళ్తాడు. అలాగే వృశ్చికంలోని కేతువు, మకరంలో ఒక్కరించి నటువంటి శని మీనరాశిలో ఒక్కరించినటువంటి గురువు ఉన్నారు.

Zodiac Signs : అలాగే గ్రహ స్థితి ఏ విధంగా ఉన్నాయంటే…

horoscope July 2022 Zodiac Signs for Gemini
horoscope July 2022 Zodiac Signs for Gemini

ఈ మిధున రాశి వారికి బుధుడు మూడో స్థానంలో ఉన్నాడు. అలా ఉండడం వలన, ఈ రాశి వారికి గవర్నమెంట్ వ్యక్తులతో కొన్ని పరిచయాలు జరుగుతాయి. 16వ తేదీ నుండి 21వ తేదీ కి మధ్యలో ఇవి జరగనున్నాయి. అలాగే భూములు అమ్మే విషయాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏవైనా కొత్త ఆస్తులు కొనుగోలు చేయాలి అనుకున్నవారు అలాగే విద్యార్థులకు 21 తర్వాత వారు తీసుకునే నిర్ణయాలు చాలా బాగా అనుకూలిస్తాయి. అలాగే భూములు కి సంబంధించిన అలాగే రైతులు పంటలకు సంబంధించినవీ కూడా మంచి అనుకూలత కనిపిస్తుంది. అలాగే ఎప్పటినుంచో ప్రయత్నించి రుణాలు ఈ నెలలో ఫలించే అవకాశం కనిపిస్తుంది.

అదే విధంగా కుటుంబ సభ్యులతో కొద్దిగా ఘర్షణ జరిగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి సూర్య భగవానుని చూస్తూ “ఓం మిత్రాయ నమః” అని రోజు పఠనం చేయాలి. 11 సార్లు, ఇలా చేయడం వలన ఇలాంటి చిన్న చిన్న ఘర్షణలు జరగకుండా ఆగిపోతాయి. అలాగే గర్భవతులు, సినిమా రంగానికి చెందినవారు, అలాగే కళాకారులు ఆచి తూచి అడుగు వేయవలసి వస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. అదేవిధంగా రుణాలకి సంబంధించిన విషయాలు బాగానే ఉంటుంది. కానీ కొన్ని వివాహ సంబంధ విషయాలలో కొన్ని మార్పులు జరుగుతాయి.

అలాగే భాగస్వామి ఉద్యోగ సంబంధించిన విషయంలో కూడా కొన్ని మార్పులు జరుగుతాయి. అలాగే మీకు పూర్వీకుల ఆస్తులు కలిసి వచ్చేది కనిపిస్తుంది. అదేవిధంగా మీరు ఏదైనా పనిని ధైర్యంగా చేస్తే మీరు మంచి విజయాలను పొందుతారు. మీకు అన్ని పనులలో విజయాలను పొందాలంటే. ఈ మిధున రాశి వారు చేయవలసిన దేవతారాధన: మీరు నిద్ర లేవగానే గణపతి ధ్యానం చేస్తూ లేవాలి. అలాగే నిత్యము గణపతి అష్టోత్రం చదువుకోవడం మంచిది. నవగ్రహాలలో కేతువు దగ్గర దీపారాధన చేయండి. ఇలా చేయడం వలన అన్ని విధాలుగా బాగుంటుంది.