Sudigaali Sudheer : జబర్దస్త్ రీఎంట్రీ ఇవ్వనున్న సుడిగాలి సుదీర్… ప్రోమోలో హింట్ దొరికేసిందిగా..

Sudigaali Sudheer : సుడిగాలి సుదీర్ బుల్లితెరపై ఒక స్టార్ గా ఎదుగుతున్నాడు. రోజు రోజుకి తనకు ఫాలోయింగ్ పెరిగిపోతోంది. జబర్దస్త్ లో దాదాపు పది సంవత్సరాల నుంచి తన హవా కొనసాగిస్తుండగా కొన్ని కారణాలవల్ల ఆ షో నుండి సుడిగాలి సుదీర్ బయటికి వచ్చాడు. జబర్దస్త్ షో మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ షోకి జడ్జిగా చేసినటువంటి నాగబాబు గారు షోను వదిలి వెళ్లిన కొద్దికాలంలోనే ఈ షోలో టాప్ కమెడియన్ లేనటువంటి చమ్మక్ చంద్ర ,కిరాక్ ఆర్పి మరియు వండర్స్ వేణు, ధన్ రాజు లాంటి వారిని తీసుకెళ్లడం జరిగింది. అయితే హైపర్ ఆది మరియు సుడిగాలి సుదీర్ ,గెటప్ శీను వారి లాంటి వారు ఉండడంతో వారి వెళ్లిన లోటు తెలియకుండా వీరి పర్ఫామెన్స్ తో నెట్టుకొచ్చారు.

జబర్దస్త్ కు ఈ మధ్య కాలంలో రోజా గారు కూడా తనకు మంత్రి పదవి వరించడంతో గుడ్ బై చేపడంతో ఒకరు ఒకరుగా ఈ షోని వదిలి వెళ్లిపోతున్నారు. అలా వెళ్ళిన వారిలో సుడిగాలి సుదీర్ కూడా ఒకడు. ఇప్పుడు స్టార్ మా లో అనసూయతో చేస్తుండడంతో సుడిగాలి సుదీర్ అక్కడ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ మధ్యకాలంలో కిరాక్ అర్ పి మరియు ఏడుకొండలు మాలేమల గురించి రచ్చ రచ్చ చేస్తూన్న విషయం సోషల్ మీడియా మరియు టీవీలలో వైరల్ గా మారడంతో దీనిపై గెటప్ శీను మరియు హైపర్ ఆది కొంత వరకు క్లారిటీ ఇవ్వటం జరిగింది.

Sudigaali Sudheer : జబర్దస్త్ రీఎంట్రీ ఇవ్వనున్న సుడిగాలి సుదీర్…

sudigali suhdeer re entry on jabardasth
sudigali suhdeer re entry on jabardasth

ఇప్పుడు సుడిగాలి సుధీర్ తో పాటు గెటప్ శీను కూడా జబర్దస్త్ నుంచి వెళ్ళిపోయారు. అయితే జబర్దస్త్ కు మళ్లీ సుడిగాలి సుదీర్ వస్తున్నట్లుగా కొన్ని సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ప్రోమోలో రష్మీ బయోగ్రఫీ తో పాటు సుదీర్ గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. రశ్మిని చూపిస్తూ అక్క బావ ఎక్కడ అని అనడం చూస్తుంటే మళ్లీ షో కి సుడిగాలి సుదీర్ వచ్చేలా అనిపిస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. అయితే సుడిగాలి సుదీర్ మళ్ళీ తిరిగి వస్తున్నాడా లేదా అనేదానికి ఎవరు ప్రకటించలేదు. ఈ ప్రకటన వచ్చేంతవరకు అందరూ వేసి చూడాల్సిందే.